Video: బెన్‌ స్టోక్స్‌తో జైస్వాల్ ఢీ అంటే ఢీ..! మాటల యుద్ధంలో తగ్గేదేలే అంటూ ఇచ్చిపడేశాడు..

Video: బెన్‌ స్టోక్స్‌తో జైస్వాల్ ఢీ అంటే ఢీ..! మాటల యుద్ధంలో తగ్గేదేలే అంటూ ఇచ్చిపడేశాడు..


క్రికెట్‌లో రెండు జట్ల ఆటగాళ్లు మాటామట అనుకోవడం కామన్‌. కొన్ని సార్లు తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మరీ ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బ్యాటర్లను అవుట్‌ చేసేందుకు ఫీల్డింగ్‌ స్లెడ్జ్‌ చేయడం, వాటికి బ్యాటర్లు బదులివ్వడం చేస్తూ ఉంటారు. ఇండియా-ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌, ఇండియా-ఇంగ్లాండ్‌ మధ్య జరిగినప్పుడు ఇలాంటి సీన్లు బోలెడు జరుగుతాయి. తాజాగా ఇంగ్లాండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, టీమిండియా యంగ్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ను స్లెడ్జ్‌ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, జైస్వాల్‌ కూడా తగ్గేదేలే అంటూ స్టోక్స్‌కు ఇచ్చిపడేశాడు. అసలేం జరిగిందంటే..

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్ట్‌ మొదలైంది. టీమిండియా తొలుత బ్యాటింగ్‌ దిగింది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఈ మ్యాచ్‌లోనూ కూడా మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. జైస్వాల్‌ ఆటకు విసిగిపోయిన ఇంగ్లాండ్‌, ఇతన్ని అవుట్‌ చేయడం కష్టంగా మారుతుందని భావించిన తరుణంలో స్లెడ్జింగ్‌కు దిగారు. ఏకంగా కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, జైస్వాల్‌ను ఏదో అన్నాడు. అందుకే జైస్వాల్‌ కూడా సరైన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వీడియో చూస్తూ.. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఏదో సీరియస్‌ మాటలే ఎక్స్‌ఛేంజ్‌ అయినట్లు అర్థం అవుతుంది. ఒక సీనియర్‌ ప్లేయర్‌ అని ఏ మాత్రం బెరుకులేకుండా.. జైస్వాల్‌ బెన్‌ స్టోక్స్‌కు సరిగ్గా బుద్ధి చెప్పాడంటూ క్రికెట్‌ అభిమానులు అతన్ని మెచ్చుకుంటున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ జైస్వాల్‌ 107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు చేసి రాణించాడు. కానీ, సెంచరీకి చేరువగా వచ్చి అవుటై కాస్త నిరాశపర్చాడు. ఇక కరున్‌ నాయర్‌ 31, రిషభ్‌ పంత్‌ 25 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యారు. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ 59 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇక తొలి మ్యాచ్‌లో ఆడని నితీష్‌ కుమార్‌ రెడ్డి ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం అందుకున్నాడు. కానీ, తీవ్రంగా నిరాశపర్చాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. గిల్‌తో పాటు ప్రస్తుతం జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. టీమిండియా 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి.. ఇబ్బందుల్లో ఉంది. గిల్‌ లాంగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి, జడేజా మంచి సపోర్ట్‌ ఇస్తేనే ఈ మ్యచ్‌లో భారత్‌ పట్టు సాధించే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *