
కొంతమంది జీవించే విధానం, తినే ఆహారం, వారికి ఉన్న అలవాట్లు వింతగా ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? అని ఆశ్చర్యం కలుగకమానదు. చైనాకు చెందిన ఒక యువతి కూడా అదే కోవకు చెందింది. తనకు పాములంటే పిచ్చి ఇష్టం. ఎంతంటే.. వాటి కోసం ప్రత్యేకంగా ఒక బెడ్ రూమ్ నే తయారు చేసంది. ఆ బెడ్లోరూమ్‌లో దుప్పటి ఎత్తగానే పాములు కుప్పలు కుప్పలుగా ఉంటాయి. ఆమె పాముల పిచ్చికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
sports.jx.china అనే X ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక యువతి మంచం మీద ఉన్న దుప్పటిని ఎత్తడం చూడవచ్చు. ఈ మంచం మీద చాలా పాములు ఉన్నాయి. అవి నేలపై పాకుతున్నాయి. చైనాకు చెందిన ఈ యువతి తన ఇంటిని కూడా పాముల పెంపకం కేంద్రంగా మార్చుకుంది. అందుకే, ప్రతిరోజూ ఆమె దుప్పటిని ఎత్తి మంచం మీద ఉన్న పాములను నేలపైకి విసిరి, మంచం పైభాగాన్ని శుభ్రం చేస్తుంది. ఈ వీడియోను 8.2 మిలియన్లకు పైగా వీక్షించారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి