Video: ఇదేందయ్యా ఇది.. విక్టరీ ఇచ్చిన కిక్‌తో ముద్దులు, హగ్గులతో మైమరిచిపోయిన గంభీర్..

Video: ఇదేందయ్యా ఇది.. విక్టరీ ఇచ్చిన కిక్‌తో ముద్దులు, హగ్గులతో మైమరిచిపోయిన గంభీర్..


Gautam Gambhir Rare Moment: ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభమాన్ గిల్ మధ్య చోటుచేసుకున్న అరుదైన, భావోద్వేగపూరిత సన్నివేశం క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ విజయం తర్వాత ఇద్దరూ ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ విజయం భారత క్రికెట్ జట్టుకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఇటీవల కాలంలో టీమ్ ఇండియా గంభీర్ కోచింగ్ లో టెస్ట్ ఫార్మాట్ లో ఇబ్బందులు ఎదుర్కొంది. గతంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వైట్‌వాష్, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-2తో డ్రా చేసుకోవడం గంభీర్, యువ కెప్టెన్ గిల్‌కు గొప్ప రిలీఫ్.

ఇవి కూడా చదవండి

ఆఖరి టెస్టులో భారత్ విజయం తర్వాత మైదానంలో ఆటగాళ్లంతా సంబరాలు చేసుకుంటున్న సమయంలో, శుభమాన్ గిల్ నేరుగా గౌతమ్ గంభీర్ వద్దకు వెళ్లి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంలో వారిద్దరి మధ్య మాటలు లేకపోయినా, వారి కౌగిలిలో ఆ సిరీస్ విజయం కోసం పడిన శ్రమ, ఒత్తిడి, ఆనందం అన్నీ కనిపించాయి. గంభీర్ కూడా గిల్‌ను ఆప్యాయంగా తల మీద తట్టి అభినందించారు. ఈ సన్నివేశం కోచ్, కెప్టెన్ మధ్య ఉన్న బంధాన్ని, నమ్మకాన్ని స్పష్టంగా చూపించింది.

సిరీస్ ముగిసిన తర్వాత గిల్ మాట్లాడుతూ, ఈ సిరీస్ ప్రారంభానికి ముందు గంభీర్ తమతో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకున్నారు. “మనం యువ జట్టు కావచ్చు, కానీ మనం యువ జట్టులా కనిపించకూడదు. మనం ఒక ‘గన్ టీమ్’లా కనిపించాలి” అని గంభీర్ తమను ప్రోత్సహించినట్లు గిల్ వెల్లడించారు. ఈ విజయం తర్వాత గంభీర్ కూడా తన అధికారిక X ఖాతాలో “మేం కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం.. కానీ ఎప్పుడూ లొంగిపోం! బాగా ఆడారు కుర్రాళ్ళు!” అంటూ పోస్ట్ చేశారు.

ఓవల్ టెస్ట్ విజయం కేవలం ఒక మ్యాచ్ గెలుపు కాదు, ఇది భారత క్రికెట్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది. ముఖ్యంగా గంభీర్, గిల్ భాగస్వామ్యం ఈ యువ జట్టుకు కొత్త దిశను చూపుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అరుదైన కౌగిలి ఒక కోచ్, కెప్టెన్ మధ్య ఉన్న పరస్పర నమ్మకాన్ని, విజయకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పింది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *