Vaibhav Suryavanshi: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అండర్19 ODI సిరీస్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరిశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 20 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, రిషబ్ పంత్ నెలకొల్పిన వేగవంతమైన అండర్ 19 వన్డే హాఫ్ సెంచరీ రికార్డును తృటిలో మిస్ అయ్యాడు. పంత్ 18 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకోగా, సూర్యవంశీ రెండు బంతులు అదనంగా ఆడాడు. దీంతో కేవలం 2 బంతుల తేడాతో ఈ అద్భుత రికార్డ్‌ను మిస్సయ్యాడు.
నార్తాంప్టన్‌లో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 31 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 86 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఈ మెరుపు ఇన్నింగ్స్ భారత అండర్-19 బ్యాట్స్‌మెన్లలో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా బద్దలు కొట్టింది.
14 ఏళ్ల సూర్యవంశీ ఇటీవల IPLలో రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అక్కడ కూడా కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ అండర్ 19 సిరీస్‌లో కూడా సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో 19 బంతుల్లో 48 పరుగులు, రెండవ మ్యాచ్‌లో 34 బంతుల్లో 45 పరుగులు చేసి, మూడవ మ్యాచ్‌లో ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో తన ప్రతిభను మరోసారి చాటాడు.
Vaibhav Suryavanshi smashes back to back sixes! 🥶🔥 pic.twitter.com/lyIURNP84q
— Sports Culture (@SportsCulture24) July 2, 2025
వైభవ్ సూర్యవంశీ వంటి యువ ప్రతిభావంతులు భారత క్రికెట్‌కు గొప్ప భవిష్యత్తును అందిస్తున్నారు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్‌పై 2-1 ఆధిక్యంలో నిలిచింది. వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే, త్వరలోనే అతను సీనియర్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..