వాస్తు శాస్త్రం హిందూ మతంలో ఒక పురాతన నిర్మాణ శాస్త్రం. ఇల్లు లేదా భవనం నిర్మించే సమయంలో వాస్తుని పాటిస్తారు. శ్రేయస్సు, ఆరోగ్యం, సంతోషాన్ని పెంపొందించడానికి కొన్ని నియమాలను పేర్కొంది. అందుకనే హిందువులు వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను శుభప్రదంగా నమ్ముతారు. అదే సమయంలో చాలా విషయాలు అశుభకరం అని విశ్వసిస్తారు. కొన్ని వస్తువులు, కొన్ని జీవుల విషయంలో కూడా కొన్ని నమ్మకాలున్నాయి.
వాస్తు శాస్త్రంలో ఇంట్లో జంతువులు, పక్షుల గురించి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వాటిలో పావురాలు ఒకటి. వాటిని ఆనందం, శాంతికి చిహ్నంగా పరిగణించినప్పటికీ.. అవి ఇంట్లో ఉండడం గురించి కొన్ని అశుభకరమైన అభిప్రాయాలు ఉన్నాయి. హిందూ పురాణ గ్రంథాలలో పావురాలను లక్ష్మీ దేవి నివాసంగా భావిస్తారు. కొంతమంది ఇంట్లోకి వాటి రాకను శుభప్రదంగా భావిస్తారు. మరికొందరు దానిని అశుభకరంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో పావురం గూడు పెట్టడం శుభదా లేదా అశుభమో ఈ రోజు తెలుసుకుందాం..
ఇంట్లో పావురం గూడు: సాధారణంగా ఇంట్లో పావురం గూడు ఉండటం అశుభకరమని భావిస్తారు. ఇంటి బాల్కనీ లేదా పైకప్పుపై పావురం గూడు కట్టుకుంటే అది దురదృష్టాన్ని తెచ్చినట్లు ప్రజలు నమ్ముతారు. అంతేకాదు పావురాల గూడు ఉంటే ఇంట్లో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని భయపడి వెంటనే ఆ గూడుని తొలగిస్తారు.
పావురాలు లక్ష్మీ దేవతకి భక్తులు. పావురాలు ఇంటికి వచ్చినప్పుడు అది దురదృష్టాన్ని అదృష్టంగా మారుస్తుందని చెబుతారు. అవి నివసించే ఇల్లు ఎల్లప్పుడూ ఆనందం, సామరస్యంతో నుంచి ఉంటుంది. ఇది అదృష్టాన్ని కూడా తెస్తుంది. అందువల్ల, వాటి గూడును ఎప్పుడూ ఇంటి నుంచి తొలగించకూడదని మరికొందరు విశ్వాసం.
అయితే ఇంట్లో పావురాల గూడుకి, పావురాలకు సంబంధించిన అనేక ఇతర సంకేతాలు ఉన్నాయి. అవి బయటకు వెళ్ళేటప్పుడు అకస్మాత్తుగా మీ కుడి వైపు నుంచి ఎగిరితే అది మీ సోదరుడు, బంధువులకు శుభం కాదు.
వాస్తు శాస్త్రం ప్రకారం పావురం రోజు ఉదయమే ఇంట్లోకి వస్తే.. మీకు ప్రయోజనాలు లభిస్తాయని అర్థం. అయితే రోజులో మూడవ భాగం అంటే సాయత్రం ఇంట్లోకి వస్తే అది వివాహం లేదా ప్రేమకు సంబంధించిన ప్రయోజనాలను తెస్తుంది. అయితే పావురం రోజు నాల్గవ భాగంలో అంటే రాత్రి ఇంటికి వస్తే పనిలో ఆటంకం కలగనుందని అర్ధమట.