Vastu Tips: ఏ దిశలో తల పెట్టి నిద్రించడం మంచిది? ఈ దిక్కు మీ సంపదను రెట్టింపు చేస్తుంది..!

Vastu Tips: ఏ దిశలో తల పెట్టి నిద్రించడం మంచిది? ఈ దిక్కు మీ సంపదను రెట్టింపు చేస్తుంది..!


వాస్తు శాస్త్రంలో నిద్ర దిశకు సంబంధించి కూడా ప్రస్తావిస్తుంది. దీని ప్రకారం తలను తప్పుడు దిశలో ఉంచి నిద్రపోవడం వల్ల అనారోగ్య ప్రమాదం పెరగడమే కాకుండా ఆయుష్షు కూడా తగ్గుతుందని వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం, సరైన దిశలో నిద్రపోవడం వల్ల జీవితంలో ఆనందం, సంపద, ఆరోగ్యం పెరుగుతాయని చెబుతున్నారు. వాస్తు ప్రకారం, మీరు ఏ దిశలో తల పెట్టి పడుకుంటారో, ఆ దిశలో పడుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం…

వాస్తు ప్రకారం, ఉత్తర దిశలో తల పెట్టి పడుకోవడం అంత శుభం కాదు. ఈ దిశలో పడుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. మీ ఆయుష్షు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఇలా పడుకోవడం వల్ల అశాంతి పెరుగుతుంది. ప్రశాంతమైన నిద్ర లభించదు. వారికి రాత్రంతా కల్లోలంగా ఉంటుంది. తీవ్రంగా అలిసిపోయినట్లు, ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది.

ఎందుకంటే, దీని వెనుక శాస్త్రీ కారణం కూడా చెబుతున్నారు నిపుణులు. అదేంటంటే.. భూమికి ఉత్తర దిశ ధనావేశంతో ఉంటుంది. మనిషి తల కూడా ధనావేశంతో ఛార్జ్ అయి ఉంటుంది. దీంతో రెండు ధనావేశ అయస్కాంత ప్రభావాలు మనిషిపై పడి మనసులో కల్లోల పరిస్థితులను సృష్టిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అందుకే ఉత్తర దిక్కుకు ఎప్పుడూ తలపెట్టి పదుకోకూడదని సూచిస్తున్నారు. అలాగే, పడమర వైపు తల పెట్టి నిద్రపోవడం కూడా సరైనది కాదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, వాస్తు ప్రకారం, తల దక్షిణం వైపు పెట్టుకుని పాదాలు ఉత్తరం వైపున ఉండటం వాస్తులో అత్యంత ఉత్తమమైనదిగా చెబుతున్నారు. దక్షిణం వైపు తల పెట్టి నిద్రపోవడం వల్ల విద్యా విజయం లభిస్తుంది. కీర్తి, గౌరవం పెరుగుతాయి. జీవితంలో శాంతి నెలకొంటుంది. ఈ దిశలో తల పెట్టి పడుకోవడం వల్ల జీవితంలో ఆనందం, సుఖం పెరుగుతాయి. ఇది ఆరోగ్యాన్ని, శాంతిని, చక్కటి నిద్రను ప్రోత్సహిస్తుంది. మీరు అపారమైన సంపదతో దీవించబడతారు. జీవితంలో ఎల్లప్పుడూ ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది.

వాస్తు ప్రకారం..తల తూర్పువైపు పెట్టి నిద్రపోవడం వాస్తు ప్రకారం రెండో మంచి దిశగా చెబుతారు. ఇది మానసిక స్పష్టతను, శక్తిని, ఆధ్యాత్మిక వృద్ధిని కలిగిస్తుంది. విద్యార్థులకు, ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేయడానికి తూర్పు దిశ మంచిదని వాస్తు,జ్యోతిశాస్త్ర పండితులు చెబుతున్నారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *