భారతీయ వాస్తు శాస్త్రంలో, పురాణ గ్రంథాలలో ఇంటి ప్రధాన ద్వారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇంట్లోకి వచ్చే శక్తి ప్రవేశం మాత్రమే కాదు, శుభ, అశుభ శక్తుల ప్రభావం కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. కొన్ని ప్రత్యేక వస్తువులను ప్రధాన ద్వారంపై సరిగ్గా ఉంచితే..ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. ప్రతికూల శక్తుల ప్రవేశం ఆగిపోతుంది. ప్రధాన ద్వారంపై వేలాడదీసినప్పుడు ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును కాపాడే 5 అద్భుత విషయాలను తెలుసుకుందాం.
మామిడి తోరణం
ప్రధాన ద్వారానికి తోరణం కట్టడం హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. మామిడి ఆకులు, అశోక ఆకులు, బంతి పువ్వులతో తయారు చేసిన తోరణం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆకులు, పువ్వులు ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇది ఇంట్లో పండుగ, ఉల్లాస వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ వస్తువులు పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయని, అతిథులను స్వాగతిస్తాయని నమ్ముతారు.
గుర్రపు నాడా
వాస్తు, ఫెంగ్ షుయ్ రెండింటిలోనూ నల్ల గుర్రపు నాడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ప్రధాన ద్వారం పైన ‘U’ ఆకారంలో వేలాడదీయడం ద్వారా చెడు దృష్టి, ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించలేవు. అంతేకాదు ఇది సంపద శ్రేయస్సును కూడా ఆకర్షిస్తుంది. అయితే దీని నుంచి పూర్తి ప్రయోజనాన్ని పొందగలిగేలా గుర్రపు నాడాను సరైన దిశలో, సరైన పద్ధతిలో ఉంచాలని నిర్ధారించుకోండి.
ఇవి కూడా చదవండి
స్వస్తిక చిహ్నం
హిందూ మతంలో స్వస్తిక్ చాలా పవిత్రమైన, శుభప్రదమైన చిహ్నం. ప్రధాన ద్వారానికి ఇరువైపులా లేదా తలుపు పైన ఉంచడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఇది శ్రేయస్సు, అదృష్టం, శాంతికి చిహ్నం. స్వస్తిక్ ప్రతికూల శక్తులను తరిమివేసి ఇంట్లో శాంతి , ఆనందాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. కుంకుమ లేదా గంధంతో ఇంటి తలుపు పై దీనిని వేయడం వలన చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.
విండ్ చైమ్
లోహం లేదా వెదురుతో తయారు చేసిన విండ్ చైమ్ మధురమైన శబ్దం ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. సానుకూల శక్తిని తెస్తుంది. ప్రధాన తలుపు దగ్గర విండ్ చైమ్‌ను ఉంచడం ద్వారా ప్రతికూల శక్తి ఇంటి లోపలకు ప్రవేశించదు. దీని ప్రభావం తగ్గుతుంది. విండ్ చైమ్ నుంచి టింక్లింగ్ శబ్దం ఇంట్లో సానుకూల ప్రకంపనలను సృష్టిస్తుంది. మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. విండ్ చైమ్‌ను ఎంచుకునేటప్పుడు దానిని తయారు చేసిన వస్తువులు, వచ్చే ధ్వనిపై శ్రద్ధ చూపడం ముఖ్యం.
శుభప్రదమైన యంత్రం లేదా గణేష్ విగ్రహం
ప్రధాన ద్వారం మీద గణేశుడి విగ్రహాన్ని లేదా లక్ష్మీదేవి యంత్రాన్ని ఉంచడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. గణేశుడిని విఘ్నాలను హరించే వాడు అని అంటారు. అతను ఇంట్లోకి వచ్చే అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు దేవత. ఆమె ఉనికి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు మరియు శాంతిని తెస్తుంది. విగ్రహం లేదా యంత్రాన్ని శుభ్రంగా ఉంచి క్రమం తప్పకుండా పూజించాలని గుర్తుంచుకోండి.
మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఈ వస్తువులను వేలాడదీయడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచవచ్చు. ప్రతికూల శక్తులను దూరంగా ఉంచవచ్చు. ఇది మీ ఇంటికి భద్రతను అందించడమే కాదు జీవితంలో ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.