Vastu tips: ఆగ్నేయంలో వాస్తుదోషాలు యమ డేంజర్..సరిచేసుకోకుంటే సర్వనాశనం తప్పదట..!

Vastu tips: ఆగ్నేయంలో వాస్తుదోషాలు యమ డేంజర్..సరిచేసుకోకుంటే సర్వనాశనం తప్పదట..!


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..హిందూ మతంలో దాదాపు ప్రతి ఒక్కరూ వాస్తును విశ్వసిస్తారు. ప్రతి నిర్మాణానికి వాస్తును తప్పనిసరిగా పాటిస్తుంటారు. ప్రతిఇంటి నిర్మాణంలో అష్టదిశలలో ఆగ్నేయం కూడా అతి ముఖ్యమైనది. మీరు మీ ఇంటి ఆగ్నేయ దిశపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ఈ దిశ అగ్ని మూలకానికి సంబంధించినది. ఇది సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అగ్ని అనేది అందం, వ్యక్తిత్వం, డబ్బు అనుసంధానించబడిన ఒక అంశం కూడా. ఇంట్లో ఆగ్నేయ దిశను విస్మరించవద్దు. ఆర్థిక శ్రేయస్సు, విజయం కోసం ఈ వాస్తు నివారణలను తప్పక పాటించండి.

ఈ దిశలో తలుపు, పెద్ద కిటికీ లేదా మరే ఇతర ప్రవేశ ద్వారం ఉండకూడదు. దీని కారణంగా, ఇంట్లోని వ్యక్తులు ఆర్థికంగా అస్థిరంగా మారే ప్రమాదం ఉంటుంది. ఆర్థిక పురోగతి ఆగిపోతుంది. మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలనుకుంటే, ఇంటి ఆగ్నేయ మూలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలుసుకోండి. ఇది ఆర్థిక వృద్ధి, విజయానికి సంబంధించినది.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఆగ్నేయ మూల అగ్నికి చిహ్నం. కాబట్టి, వంటగది, టీవీని ఈ దిశలో ఉంచవచ్చు. వంటగదిలోని స్టవ్ తూర్పు దిశలో ఉండాలి. నీరు, టాయిలెట్లు, బరువైన ఫర్నిచర్ బెడ్ రూములు ఈ దిశలో ఉండకూడదు. కావాలంటే మీరు మనీ ప్లాంట్‌ను ఈ దిశలో ఉంచితే, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెద్ద, విరిగిన వస్తువులను ఈ దిశలో ఉంచకూడదు.

ఇవి కూడా చదవండి

జీవితంలో విజయం సాధించాలనుకుంటే, ఇంటి తూర్పు, ఉత్తరం వైపు తలుపులు, కీటికీలు తెరిచి, ప్రకాశవంతంగా ఉంచాలి. ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే, మీరు ఇంట్లో ఒక గిన్నెలో సముద్రపు నీటిని ఉంచాలి. దానిని వారానికి ఒకసారి మార్చాలి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *