వాస్తు శాస్త్రం మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఉండే వస్తువులు సానుకూల, ప్రతికూల శక్తులను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా, కొన్ని వస్తువులను ఇతరులకు ఉచితంగా ఇస్తే లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుందని నమ్ముతారు. ఆ వస్తువుల మన చేజారితే ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. అందుకే ఈ వస్తువులను ఇవ్వడం లేదా తీసుకోవడం లాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉచితంగా ఇవ్వకూడని ఆ ఐదు వస్తువుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఉప్పు: వాస్తు ప్రకారం, ఉప్పును ఉచితంగా ఇవ్వడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. ఎప్పుడైనా ఉప్పు ఇచ్చేటప్పుడు దానికి ప్రతిగా కొద్దిగా డబ్బు తీసుకుంటే మంచిది.
చీపురు: చీపురును లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుగా భావిస్తారు. ఇది ఇంట్లో శుభ్రతకు చిహ్నం. చీపురును ఎవరికైనా ఉచితంగా ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. దీంతో ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి.
పదునైన వస్తువులు: కత్తి, కత్తెర, సూది లాంటి పదునైన వస్తువులను ఉచితంగా ఇవ్వడం అశుభం. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయి, సంబంధాలు దెబ్బతింటాయి.
నూనె: సూర్యాస్తమయం తర్వాత నూనెను ఇతరులకు ఇవ్వకూడదు. వాస్తు ప్రకారం, ఇలా చేస్తే శని ప్రభావం పడి ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి.
వెల్లుల్లి, ఉల్లిపాయలు: ఈ రెండింటిని ఉచితంగా ఇస్తే ఇంట్లో డబ్బు నిలవదు. దీనివల్ల డబ్బు నష్టం జరుగుతుంది.
ఈ వస్తువులను ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు కొద్దిగా డబ్బు ఇస్తే, వాటిని ఉచితంగా ఇచ్చినట్లు కాదు. దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. వాస్తు ప్రకారం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది