Vastu Plants: ఇంటి ముందు ఏ మొక్కలు నాటితే మంచిది..? లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఇలా చేయండి..

Vastu Plants: ఇంటి ముందు ఏ మొక్కలు నాటితే మంచిది..? లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఇలా చేయండి..


Plants for Home: ఇంటి ఆవరణలో సరైన మొక్కలను పెంచడం వల్ల ఆరోగ్యం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శాంతి, సానుకూల శక్తి కూడా లభిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. నేటి అపార్ట్‌మెంట్ జీవనశైలిలో కూడా వీలైనన్ని ఎక్కువ మొక్కలను పెంచడం మంచిదని వారు సలహా ఇస్తున్నారు. వాస్తు శాస్త్రం భవనాల నిర్మాణంతోపాటు.. ప్రకృతి శక్తులు.. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం.. సమతుల్యం చేస్తుంది.. దీంతో నివాసితుల ఆరోగ్యం, సంపద, సంతోషాన్ని పెంచుతుందని నమ్మకం.. అందుకే.. వాస్తు శాస్త్రం ప్రకారం.. దిశలకు, స్థల అమరికకు చాలామంది అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని నమ్ముతారు.

వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంటి ముందు ఏ మొక్కలు నాటితే శుభం.. ఆరోగ్యం, శాంతి, సంపదకు ఏ మొక్కలు ఉపయోగపడతాయి.. వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారు.. అనే వివరాలను తెలుసుకుందాం..

తులసి మొక్క..

హిందూ సంప్రదాయంలో తులసిని చాలా పవిత్రంగా భావిస్తారు. తులసి ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. సానుకూల శక్తిని పెంచుతుంది. తులసిపై నీరు పోసి ప్రతిరోజూ దానిపై దీపం వెలిగించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.

బిల్వ మొక్క..

బిల్వ మొక్క శివుడికి చాలా ప్రియమైనదని నమ్ముతారు. బిల్వ ఆకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. ఇంటి ఆవరణలో బిల్వ మొక్కను పెంచడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణంతోపాటు.. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పసుపు మొక్క..

ఇంటి ముందు లేదా పెరట్లో పసుపును పెంచడం కూడా శుభప్రదం. పసుపుకు ఔషధ, క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. ఇంట్లో పసుపును కలిగి ఉండటం శుభప్రదమని నమ్ముతారు.. దీనిని శుభ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

పూల మొక్కలు..

పూల మొక్కలలో.. మల్లె, గులాబీ మొక్కలు పెంచడానికి మంచివి. వాటి సువాసన ఒత్తిడిని తగ్గించి మనస్సును ఉల్లాసపరుస్తుంది. ముఖ్యంగా మల్లెల సువాసన ఉదయం మనస్సును రిలాక్స్‌గా ఉంచుతుంది. వీటితోపాటు.. కలబంద, మనీప్లాంట్.. మొక్కలను కూడా పెంచవచ్చు..

తమలపాకులు..

అదనంగా, తమలపాకులు, కరివేపాకు, అరటి, నిమ్మ, ఆకుకూరలు, వంటి మొక్కలను పెంచవచ్చు. ఇవి రోజువారీ ఉపయోగం కోసం ఉపయోగపడతాయి.. పచ్చని వాతావరణం ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పెంచుతుంది.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం వాస్తు, జ్యోతిషశాస్త్రం ఆధారంగా రూపొందించబడింది.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *