Varalakshmi Vratham: వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజించి, ఉపవాసం ఉండి, మంత్రాలు జపించాలి. అలాగే, ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడం, దీపారాధన చేయడం, దానధర్మాలు చేయడం వంటివి చేయడం మంచిదని పురోహితులు సూచిస్తున్నారు.
వరలక్ష్మీ వ్రతం రోజు ఏం చేయాలి:
- ఉదయాన్నే లేచి తలంటుకుని, శుభ్రమైన బట్టలు వేసుకోవాలి.
- ఇంటిని శుభ్రం చేసుకుని, పూజా మందిరాన్ని అలంకరించాలి.
- లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను ప్రతిష్టించి, కలశాన్ని ఏర్పాటు చేయాలి.
- పూజకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. (పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, పండ్లు, నైవేద్యాలు మొదలైనవి)
- లక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేయాలి. అంటే, 16 విధాలుగా పూజించాలి.
- వరలక్ష్మీ వ్రత కథను చదవాలి లేదా వినాలి.
- మంత్రాలు జపించాలి. ముఖ్యంగా “ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలాయై నమః” అనే మంత్రాన్ని జపించాలి.
- ముత్తైదువులను పిలిచి, వారికి వాయినాలు ఇవ్వాలి.
- సాయంత్రం హారతి ఇవ్వాలి.
- అన్నదానం చేయాలి.
- అవసరమైనవారికి దానధర్మాలు చేయాలి.
- ఉపవాసం ఉండి, రాత్రికి ఫలహారం తీసుకోవాలి.
వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత:
- వరలక్ష్మీ వ్రతం స్త్రీలకు ఎంతో ముఖ్యమైనది. ఇది సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది.
- లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి.
- కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు లభిస్తాయి.
- ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు నిత్య సుమంగళిగా ఉంటారు.
ముఖ్యమైన సూచన:
- పూజ చేసేటప్పుడు, మనస్సు ఏకాగ్రంగా ఉంచి, భక్తితో చేయాలి.
- పూజకు సంబంధించిన నియమాలను పాటించాలి.
- తెలియని విషయాలను పెద్దలను అడిగి తెలుసుకోవాలి.
వరలక్ష్మీ వ్రతం శుక్రవారం రోజు వస్తుంది. అందుకే ఈ రోజు ఉప్పు దీపం (ఐశ్వర్య దీపం) పెట్టడం ధనాకర్షణకు విశేషమైనదిగా భావించి ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజు మాత్రమే కాకుండా ప్రతి శుక్రవారం రోజు పాటించవచ్చు. ముఖ్యంగా దీపావళి పండుగ రోజు మహిళలు ఆచరిస్తారు. ఈ ఆచారం వెనుక ఉన్న విశేషం ఏమిటంటే.. ఉప్పుకు ప్రతికూల శక్తులను గ్రహించి.. సానుకూల శక్తులను ఆకర్షించే స్వభావం ఉండటం వల్ల ఉప్పు దీపం పెడితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ (Negative Energy) తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ వస్తుందని విశ్వాసం. దీనివల్ల ఇంట్లో ధనాకర్షణ శక్తి పెరిగి, ఆర్థిక సమస్యలు దూరమవుతాయని ప్రశస్తి.
తులసి మొక్కకు పూజ :
తులసి మొక్కకు పూజ చేయడం, దీపారాధన చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. తులసికి హిందు సంప్రదాయంలో విశేషమైన స్థానం ఉంది. తులసిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో తులసి మొక్కకు పూజ చేస్తారు. తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి (Lakshmi Devi) అంశగా, విష్ణుమూర్తిగా అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. తులసి చెట్టు పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షంతో ఆర్యోగం, ఐశ్వర్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.
వరలక్ష్మీ వ్రతం రోజు ఆవుకు ఆహారం పెట్టడం, సేవ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని నమ్మకం. అయితే హిందు ధర్మంలో గోమాతను పవిత్రంగా భావిస్తారు. సాక్షాత్తు దేవత స్వరూపంగా, సకల దేవతలకు నిలయంగా భావిస్తారు. గోమాతను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని అందరి విశ్వాసం. అంతేకాదు.. సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం.
(ఇందులోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా మాత్రమే అందిస్తున్నాము. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి