4 జనవరి 1994న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించింది వైష్ణవి చైతన్య. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉంటుంది. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్‌లతో కెరీర్ ప్రారంభించి హీరోయిన్గా ఎదిగింది ఈ సుకుమారి.
సాఫ్ట్వేర్ డెవలపర్ యూట్యూబ్ సిరీస్‌తో చాల ఫేమస్ అయింది. ఇందులో ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ హీరో. ఈ సిరీస్ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత మరికొన్ని సిరీస్‌లు, యూట్యూబ్ కవర్ సాంగ్స్ చేసింది ఈ వయ్యారి భామ.
టచ్ చేసి చూడు, మాయ పేరేమిటో, అల వైకుంఠపురములో, రంగ్‌దే, ప్రేమదేశం, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. 2022లో తమిళ సినిమా వలిమైలో రమ్య అనే పాత్రతో కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ వయ్యారి భామ.
2023లో రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ బేబీ చిత్రంలో కథానాయకిగా అరంగేట్రం చేసింది ఈ భామ. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రమిది. బేబీ సినిమాకి ఫిల్మ్‌ఫేర్ వారిచే ఉత్తమ నటిగా క్రిటిక్స్ అవార్డ్, SIIMA ద్వారా ఉత్తమ మహిళా డెబ్యూ అవార్డు గెలుచుకుంది.
2024లో వచ్చిన హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ లవ్ మీ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది సిద్దు జొన్నలగడ్డకి జోడీగా జాక్ మూవీలో కనిపించింది. యాన్ అన్ ఫినిష్డ్ స్టోరీ అనే ఓ తెలుగు సినిమాలో నటిస్తుంది.