Vaibhav Sooryavanshi Century: వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో చెలరేగిపోతున్నాడు. బౌండరీలతో డీల్ చేస్తూ సెంచరీ బాదేశాడు.
హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం భారత జట్టు వార్త రాసే సమయానికి 20 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.
అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వైభవ్..
అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ కొత్త రికార్డు సృష్టించాడు. 2026 ఎడిషన్‌లో ఇప్పటివరకు 20 సిక్సర్లతో, అతను టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గతంలో, ఈ రికార్డు 2022 అండర్-19 ప్రపంచ కప్‌లో 18 సిక్సర్లు బాదిన డెవాల్డ్ బ్రెవిస్ పేరిట ఉండేది.
ఇరు జట్లు:
ఇంగ్లాండ్ U19 (ప్లేయింగ్ XI): బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయస్, థామస్ రెవ్ (కెప్టెన్, కీపర్), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్డెన్, అలెక్స్ గ్రీన్.
ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(కీపర్), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..