ఉత్తరాఖండ్‌ని భారీ వర్షాలు వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్‌బర్స్ట్‌తో సంభవించిన జలప్రళయం దేశాన్ని కలచివేస్తోంది. ధరాలీ గ్రామం వరద నీటిలో మునిగిపోయి, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎటు చూసిన జలప్రళయంలా కనిపిస్తుంది. వరదల కారణంగా నలుగురు మృతి చెందగా, 60 మందికి పైగా గల్లంతయ్యారు. కాగా, లోతైన బురదలో చిక్కుకున్న ఓ వ్యక్తి బయటకి రావడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి బురదలో పాకుతున్న అతన్ని చూస్తేనే క్లౌడ్‌బర్స్ట్ ఎంత బీభత్సం సృష్టించిందో అర్థమవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..