
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీకి ఇద్దరు రోగులు వచ్చారు. వారిని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. ఎందుకంటే వారి శరీర నిర్మాణం వైద్యులను ఆశ్చర్యపరచడమే వైద్య శాస్త్రంలో అరుదైనదిగా నిలిచింది. ఎందుకంటే ఈ రోగుల శరీరంలోని అవయవాలు సాధారణ స్థానంలో లేదా సాధారణ పరిమాణంలో లేవు. వైద్యులు ఈ అరుదైన పరిస్థితిని హెటెరోటాక్సీ సిండ్రోమ్ అని పేరు పెట్టారు.
వైద్యుల అభిప్రాయం ప్రకారం ఇది పుట్టుకతో వచ్చే వైకల్యం. దీనిలో గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, ప్లీహము, పిత్తాశయం వంటి శరీర అంతర్గత అవయవాలు వాటి సాధారణ స్థితి నుంచి స్థానభ్రంశం చెందుతాయి. 45 ఏళ్ల పురుషుడు, స్త్రీ రోగి కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలతో పరీక్ష కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ విషయం వేలుగులోకి వచ్చింది.
శరీరంలోని రహస్య నిర్మాణాన్ని వెల్లడించిన అల్ట్రాసౌండ్
సీనియర్ రేడియాలజిస్ట్ డాక్టర్ రచనా చౌరాసియా మాట్లాడుతూ.. రోగులకు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు.. గుండె ఛాతీ మధ్యలో ఉన్నట్లు తెలిసింది. గుండె సాధారణంగా ఎడమ వైపున ఉంటుంది. గుండె నాలుగు గదులు కూడా సాధారణ పరిమాణానికి భిన్నంగా ఉన్నాయని, కాలేయం రెండు వైపులా విస్తరించి ఉందని పిత్తాశయం ఎడమ వైపు నుంచి మధ్యలో ఉందని ప్లీహము స్థానంలో కుడి వైపున అనేక చిన్న నిర్మాణాలు కనిపించాయని చెప్పారు.
ఈ విషయం బయటపడింది ఇలా
CT స్కాన్‌లో పేగులు సాధారణ దిశలో వంగలేదని.. అపెండిక్స్ మధ్య రేఖలో కనిపించిందని, ఊపిరితిత్తులు కూడా అసాధారణంగా ఉన్నాయని కనిపించాయి. ఈ అసాధారణ శరీర నిర్మాణాన్ని చూసిన వైద్యులు కేసు తీవ్రమైనదని భావించారు. ఈ వ్యాధికి హెటెరోటాక్సీ సిండ్రోమ్ పేరు పెట్టారు.
డాక్టర్ రచన ప్రకారం ఈ రుగ్మత చాలా అరుదు. 25,000 మంది రోగులలో ఒకరు ఈ సిండ్రోమ్‌తో బాధపడుతుంటారు. చాలా సందర్భాలలో బాల్యంలోనే గుండె జబ్బు వంటి లక్షణాలతో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆస్పత్రికి వచ్చిన ఈ ఇద్దరు రోగులు చిన్న వయస్సు నుంచి ఎటువంటి లక్షణాలు లేకుండా దశాబ్దాలుగా దాగి ఉండవచ్చని రుజువు చేస్తుందని చెప్పారు. ఇటువంటి రోగులు తరచుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అందువల్ల సకాలంలో పరీక్ష, సరైన రోగ నిర్ధారణ చాలా ముఖ్యమైమని చెప్పారు.
బాల్యంలోనే గుర్తించడం ద్వారా సమస్యలను నివారించవచ్చు.
పిల్లల్లో ఈ పరిస్థితిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే, చికిత్స సాధ్యమవుతుందని, భవిష్యత్తులో వచ్చే సమస్యలను కూడా నివారించవచ్చని డాక్టర్ రచన అన్నారు. అల్ట్రాసౌండ్, CT స్కాన్ లు ప్రస్తుతం వ్యాధుల నిర్ధారణకు, గుర్తింపుకు ఆధునిక ప్రమాణాలుగా మారుతున్నాయని చెప్పారు. ఎవరైనా చాలా కాలంగా అజీర్ణం, కడుపు నొప్పి లేదా తరచుగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుంటే.. ఖచ్చితంగా శరీర అంతర్గత నిర్మాణాన్ని ఒకసారి పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..