US news: వివాహేతర సంబంధం.. భార్యకి ప్రోటీన్ షేక్ లో విషం ఇచ్చిన డాక్టర్..

US news: వివాహేతర సంబంధం.. భార్యకి ప్రోటీన్ షేక్ లో విషం ఇచ్చిన డాక్టర్..


అమెరికాలో కొలరాడోలోని అరోరాకు చెందిన దంతవైద్యుడు జేమ్స్ క్రెయిగ్ (47), తన భార్య ఏంజెలా క్రెయిగ్ (43 కు విషం ఇచ్చి చంపాడు. కోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడు అతను తల వంచుకుని నిలబడి ఉన్నాడు. తన భార్యను తన జీవితం నుంచి తప్పించడానికి అతను హత్య చేసిన ఆలోచన పద్ధతి విని కోర్టులోని జ్యూరీ కూడా షాక్ అయ్యింది.

2023లో తన భార్యను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన తర్వాత దంతవైద్యుడికి పెరోల్ అవకాశం లేకుండా జీవిత ఖైదు విధించబడింది. జేమ్స్ క్రెయిగ్ తన సహోద్యోగితో సంబంధం కలిగి ఉన్నాడు. దీంతో తన భార్యని తన మార్గం నుంచి అడ్డు తొలగించాలని భావించి తన భార్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెకు ప్రాణాంతకమైన మోతాదులో సైనైడ్ ఇచ్చే ముందు ఆర్సెనిక్ కలిపిన ప్రోటీన్ షేక్‌లను అందించాడని అధికారులు చెప్పారు.

జేమ్స్ కు చాలా మంది స్త్రీలతో సంబంధాలు

ఇవి కూడా చదవండి

ఈ కేసు 2023 సంవత్సరాల నాటిది. 47 ఏళ్ల జేమ్స్ క్రెయిగ్ తన భార్య ఏంజెలాను వదిలించుకోవాలని అనుకున్నాడు. తన 23 ఏళ్ల వివాహ జీవితంలో చాలా మంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడు. చివరికి తన భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీని తరువాత అతను ప్రతిరోజూ తన భార్య తాగే ప్రోటీన్ షేక్‌లో విషం కలపడం ప్రారంభించాడు.

అయితే జేమ్స్ ప్లాన్ విజయవంతం కాలేదు. ఏంజెలా వైద్యం కోసం ఆసుపత్రిలో చేరింది. దీని తరువాత జేమ్స్ క్రెయిగ్ తన చివరి సారి ప్రయత్నం చేయాలనుకున్నాడు. అతను ఆన్‌లైన్‌లో పొటాషియం సైనైడ్ ఆర్డర్ చేశాడు. దీని తరువాత అతను ఆసుపత్రిలో చేరిన తన భార్య ఉన్న క్యాబిన్‌లోకి ప్రవేశించి ఆమెకు సైనైడ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఏంజెలా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. మృత్యువుతో పోరాడి పోరాడి చివరికి ఆమె మార్చి 2023న మరణించింది.

సైనైడ్ , టెట్రాహైడ్రోజోలిన్ వలన మరణం

ఏంజెలా సైనైడ్‌తో పాటు టెట్రాహైడ్రోజోలిన్‌ కారణంగా మరణించిందని టాక్సికాలజీ నివేదికలు వెల్లడించాయి. టెట్రాహైడ్రోజోలిన్ అనేది కంటి చుక్కలలో కనిపించే ఒక రసాయనం. తన భార్య ఏంజెలాకు విడాకులు ఇస్తే తన పేరు ప్రఖ్యాతలు, సంపద కోల్పోవాల్సి వస్తుందని భావించాడు. దీంతో భార్యని ఎవరికీ తెలియకుండా చంపాలని ప్లాన్ చేసినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. అందుకే తన భార్యను చంపడానికి సో పాయిజన్ ను ముందుగా ఎంచుకున్నాడు.

జేమ్స్ క్రెయిగ్ తరపున కేసుని వాదిస్తున్న న్యాయ బృందం అతని భార్యది ఆత్మహత్య అని నిరూపించడానికి ప్రయత్నించారు. అయితే జ్యూరీ ఈ వాదనని పూర్తిగా తిరస్కరించింది. అరపాహో కౌంటీ జిల్లా న్యాయమూర్తి షే విటేకర్ జేమ్స్ కి జీవిత ఖైదుతో పాటు అదనంగా 33 సంవత్సరాలు శిక్ష విధించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *