డైరెక్టర్ మణిరత్నం సినిమాలకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే పొన్నియన్ సెల్వన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ఇటీవల థగ్ లైఫ్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో త్రిష, శింబు, అభిరామి కీలకపాత్రలలో కనిపించారు. నాయగన్ సినిమా తర్వాత మణిరత్నం, కమల్ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ థియేటరల్లో మాత్రం ఈ సినిమా బోల్తా కొట్టింది. డిజాస్టర్ అనే టాక్ సొంతం చేసుకుంది. అంతుకు ముందు విడుదల సమయంలో పలు వివాదాల్లో చిక్కుకుంది ఈ చిత్రం. ఇప్పుడు థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది.
జూలై 2 అర్దరాత్రి తర్వాత ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింద. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సౌత్ ఎక్స్ అకౌంట్ తెలిపింది. “ఇది రంగరాయ శక్తివేల్, యముడి మధ్య పోటీ. థగ్ లైఫ్ సినిమాను ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో చూడండి ” అనే క్యాప్షన్ తో షేర్ చేసింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అనే టాక్ సొంతం చేసుకుంది. దీంతో నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. ఈ సినిమాను రూ.130 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కానీ అట్టర్ ప్లాప్ కావడంతో రూ.90 కోట్లే ఇస్తామని పేజీ పెట్టిందట. చివరకు రూ.110 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదల సమయంలో పలు వివాదాల్లో చిక్కుకుంది.
Ithu Rangaraya Sakthivel-kum yamanukum nadakura poti 🔥😎
Watch Thug Life, now on Netflix in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam#ThugLifeOnNetflix pic.twitter.com/wCG2vh0zil
— Netflix India South (@Netflix_INSouth) July 2, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..