Upasana Konidela: మా కోడలు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌‌కు కో-ఛైర్‌పర్సన్‌ అయ్యింది.. మెగాస్టార్ ఆనందం

Upasana Konidela: మా కోడలు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌‌కు కో-ఛైర్‌పర్సన్‌ అయ్యింది.. మెగాస్టార్ ఆనందం


అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌లో సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ) వైస్‌ చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది మెగా కోడలు ఉపాసన. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. సోషల్ మీడియాలోనూ వీటిపై తరచూ పోస్టులు పెడుతుంటుంది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమైన బాధ్యతలు అప్పజెప్పింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌‌కు ఆమెను కో ఛైర్మన్‌ గా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినీ అభిమానులు, నెటిజన్లు మెగా కోడలిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.

ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

అయితే రేవంత్ సర్కార్‌ తనకీ బాధ్యతలు అప్పజెప్పడంపై తన ఎక్స్‌ వేదికగా రియాక్టయ్యారు ఉపాసన. సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన ఈ అవకాశం తనకు గౌరవాన్నిచ్చిందంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఉపాసన.

ఇవి కూడా చదవండి

ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

ఇక క్రీడారంగంలో తెలంగాణ పురోగతి కోసం రేవంత్ సర్కార్ … 2025 తెలంగాణ స్పోర్ట్స్‌ పాలసీని తీసుకొచ్చింది. దీనికోసమే.. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణను రెడీ చేసింది. ఈ సంస్థకు ఛైర్మన్ గా సంజీవ్ గోయెంకాను నియమించింది. కో-ఛైర్మన్ గా ఉపాసనకు బాధ్యతలు అప్పజెప్పింది. ఉపాసన కు పలువురు సినీ ప్రేముఖులు విషెస్ తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీయుడై వేదికగా ఉపాసనను అభినందించారు. మా కోడలు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌‌కు  కో ఛైర్మన్‌ అయ్యింది అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. ” గౌరవనీయమైన పదవికి ఉపాసన కొణిదెల నియామకం పట్ల ఆనందంగా ఉంది. ఇది ఒక గౌరవం, గొప్ప బాధ్యత కూడా. డియర్‌ ఉపాసన.. మీకున్న నిబద్ధత, ప్యాషన్‌తో క్రీడల్లో దాగి ఉన్న అపార ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారని, ప్రతిభావంతులను అగ్ర స్థానంలో నిలబెట్టడానికి తగిన విధి విధానాలను రూపొందించడంలో నీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నాను. నీకు ఆ దేవుడు అశీసులు తోడుగా ఉంటాయి” అంటూ రాసుకొచ్చారు చిరంజీవి.

అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *