బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు పలు నగరాలకు అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-చిల్ గూరి మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లను నిర్మించునున్నట్లు ప్రకటించారు.