అమెరికా ప్రభుత్వం ఒక కిలో, 100 ఔన్సుల బంగారు కడ్డీలపై సుంకాలు విధించడం ప్రారంభించింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ నిర్ణయం దీర్ఘకాలిక వాణిజ్య మార్గాలను ప్రభావితం చేస్తుంది. అలాగే స్విట్జర్లాండ్ నుండి అమెరికాకు బంగారం, వెండి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. యుఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) జూలై 31 నిర్ణయం ప్రకారం, ఈ బంగారు కడ్డీలపై ఇప్పుడున్న కేటగిరి కింద సుంకం వర్తిస్తుంది.
ఈ మార్పును మొదట ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. అలాగే ఇది స్విట్జర్లాండ్‌పై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కేంద్రం, అమెరికాకు బంగారం, వెండిని సరఫరా చేసే ప్రధాన సరఫరాదారు. బంగారం ధరలు వచ్చే నెలలో ఔన్సుకు 100 నుండి 150 డాలర్లు పెరగవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో భారతదేశ ఫ్యూచర్స్ మార్కెట్ 10 వేల రూపాయల వరకు పెరగవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో ఇప్పటికే పెరుగుదల కనిపించింది. కామెక్స్ మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది.
స్విట్జర్లాండ్‌కు భారీ సుంకాల దెబ్బ:
వాషింగ్టన్, బెర్న్ మధ్య సంబంధాలు ఇటీవల క్షీణించాయి. గత వారం స్విట్జర్లాండ్ నుండి వచ్చే అన్ని దిగుమతులపై అమెరికా 39 శాతం సుంకాన్ని ప్రకటించింది. ఇందులో బంగారం కూడా ఉంది. ఇది అమెరికా మార్కెట్‌కు స్విట్జర్లాండ్ అతిపెద్ద ఎగుమతి. జూన్‌తో ముగిసిన 12 నెలల్లో స్విట్జర్లాండ్ అమెరికాకు $61.5 బిలియన్ల విలువైన బంగారాన్ని ఎగుమతి చేసింది. కొత్త సుంకం రేటు ప్రకారం.. ఈ పరిమాణం ఇప్పుడు దాదాపు $24 బిలియన్ల అదనపు సుంకానికి లోబడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Viral Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. కొంపముంచిన మొండితనం.. ఇది కరెక్టేనా మీరు చెప్పండి
ఎఫ్‌టీకి నివేదించినట్లుగా స్విస్ అసోసియేషన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ అండ్ ట్రేడర్స్ ఆఫ్ ప్రెషియస్ మెటల్స్ అధ్యక్షుడు క్రిస్టోఫ్ వైల్డ్ ఈ నిర్ణయాన్ని అమెరికాతో స్విట్జర్లాండ్ బంగారు వాణిజ్యానికి “మరో ఎదురుదెబ్బ” అని అభివర్ణించారు. స్విస్ శుద్ధి కర్మాగారాల ద్వారా తిరిగి కరిగించి అమెరికాకు ఎగుమతి చేసిన విలువైన లోహాలను సుంకం లేకుండా రవాణా చేయవచ్చనే అభిప్రాయం ప్రబలంగా ఉందని వైల్డ్ అన్నారు. అయితే వివిధ బంగారు ఉత్పత్తులకు కస్టమ్స్ కోడ్ వర్గీకరణ ఎల్లప్పుడూ ఖచ్చితమైనది కాదు.
ఇది కూడా చదవండి: Auto News: 6 ఎయిర్‌బ్యాగులు, బెస్ట్ మైలేజీ.. ధరం కేవలం రూ. 5.79 లక్షలు.. ఎప్పుడు నం 1గా నిలుస్తున్న కారు!
ఆదివారం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,03,040 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,450 ఉంది. ఇక వెండి ధర కిలో రూ.1,17,000 ఉంది.
ఇది కూడా చదవండి: Zelo Electric: 100 కి.మీ రేంజ్.. కేవలం రూ.60 వేలకే.. మార్కెట్‌ను షేక్ చేసే ఈవీ
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి