కొత్త నెంబర్‌తో కాల్ వస్తే అది ఎవరిదో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. దీని కోసం చాలా మంది ట్రూకాలర్ యాప్ వాడతారు. ఈ యాప్ ఉంటే తెలియని నెంబర్ల నుంచి కాల్ వచ్చినా.. వారి పేరు తెలుసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగంగా ఉండడంతో చాలా మంది దీనిని యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఐఫోన్ యూజర్లకు ట్రూకాలర్ షాక్ ఇవ్వనుంది. సెప్టెంబర్ 30 నుంచి కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. కంపెనీ లైవ్ కాలర్ ఐడీ , ఆటోమేటిక్ స్పామ్ కాల్ బ్లాకింగ్ వంటి ఇతర ఫీచర్లపై దృష్టి పెడుతుండడంతో iOSలో కాల్ రికార్డింగ్‌ను తీసివేయాలని నిర్ణయించినట్లు ఐవోఎస్ హెడ్ నకుల్ కబ్రా వెల్లడించారు.
జూన్ 2023లో ట్రూకాలర్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్లో దీన్ని సబ్‌స్ర్కైబ్ చేసుకున్న వాళ్లకే అందుబాటులో ఉంది. ఆ తరువాత ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. కాగా ఆపిల్ ఏ థర్డ్ పార్టీ యాప్‌ను కాల్ రికార్డ్ చేయడానికి అనుమతించదు. దీంతో ట్రూకాలర్ కాల్స్ మెర్జ్ చేసే రికార్డింగ్ లైన్‌తో కూడిన పరిష్కారాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. దీని వలన ప్రక్రియ కాస్ట్లీ తో పాటు సంక్లిష్టంగా మారింది. అందుకే దానిని మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందించారు. ‘‘ఐఫోన్లో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను నిలిపివేస్తున్నాం’’ అనే నోటిఫికేషన్‌ను ఎక్స్‌లో షేర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 30 తర్వాత స్టాప్ అవుతుంద కాబట్టి ఈ ఫీచర్‌ను ఎక్కువగా ఉపయోగించే యూజర్లు తమ రికార్డింగ్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని కంపెనీ సూచించింది.
ఇలా చేయండి..?
ట్రూకాలర్ కాల్ రికార్డింగ్‌లను ఐఫోన్లో సేవ్ చేయడానికి.. ముందుగా ఫోన్లో యాప్‌ను ఓపెన్ చేసి రికార్డ్ ట్యాబ్‌కు వెళ్లండి. తర్వాత సెట్టింగ్‌ల ఐకాన్‌పై ప్రెస్ చేయండి. స్టోరేజ్ ప్రిఫరెన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి దానిని iCloud స్టోరేజ్‌గా మార్చండి. ఒకవేళ ఇది ఆఫ్ ఉంటే.. మీరు Settings > Name > iCloud > Saved in iCloud > Turn on Truecaller పై క్లిక్ చేయాలి. ఈ ఫీచర్‌ను ఆన్ చేయడానికి ఇది మాన్యువల్ మార్గం.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..