Trisha Krishnan: బీజీపీ లీడర్‌కు త్రిష కౌంటర్.. బాధ్యతగా వ్యవహరించాలంటూ..

Trisha Krishnan: బీజీపీ లీడర్‌కు త్రిష కౌంటర్.. బాధ్యతగా వ్యవహరించాలంటూ..


స్టార్ హీరోయిన్ త్రిష పై ఇటీవల  ఓ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. త్రిషను ఉద్దేశిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగేంద్రన్.. దళపతి విజయ్ ను విమర్శిస్తూ సంచలన కామెంట్లు చేశారు. విజయ్‌కి రాజకీయాలు తెలియవు.. ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాల్టీ తెలుస్తుంది అంటూ ఊహించని కామెంట్స్ చేశారు. దాంతో అతని వ్యాక్యలు దుమారం రేపాయి. తమిళనాడు వెట్రి కల్గం సభ్యులు, ఇతర పార్టీల మహిళా నాయకులు దీనిని తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో  త్రిష తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ స్టేట్మెంట్ లో తమిళనాడు రాజకీయ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి  ఇలా తప్పుడు వ్యాఖ్య చేస్తారని నా క్లైంట్ ( త్రిష) ఊహించలేదు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, అలాగే  తాను ఏ రాజకీయ పార్టీతో అనుబంధం కలిగి ఉండాలనుకోవడం లేదు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో విమర్శించకూడదు లేదా చర్చనీయాంశంగా మార్చకూడదు అనేది తన అభిప్రాయం అంటూ స్టేట్మెంట్ లో పేర్కొంది త్రిష.

ఇవి కూడా చదవండి

అలాగే  రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో వ్యక్తులు బహిరంగ చర్చలో తమ బాధ్యతను కాపాడుకోవాలి. తన  గురించి రాజకీయంగా కాకుండా వృత్తిపరంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంకా, అనవసరమైన విషయాలలో తన పేరును చేర్చకూడదని పేర్కొంటూ త్రిష తరఫు లాయర్ నిత్యేష్ నటరాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. . ఇది ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే అక్కడి రాజకీయాల్లోనూ దీని పై పెద్ద చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో త్రిష స్టేట్మెంట్ పై నయినార్ నాగేంద్రన్  ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *