అమరావతి, జూన్ 28: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివుతున్న విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. బడికి దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లే విద్యార్ధులకు రవాణా భత్యం చెల్లించేందుకు మార్గం సుమగమమైంది. ఇందుకు సంబంధించి తాజాగా సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు మార్గదర్శకాలు విడుదల చేశారు. దీంతో 2025-26 విద్యా సంవత్సరంకి సంబంధించి సుమారు 79,860 మంది విద్యార్థులకు రూ.47.91 కోట్లు రవాణా భత్యం కింద చెల్లించనున్నారు.
విద్యార్ధుల నివాసం నుంచి కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్ధులకు, మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు ఈ రవాణా భత్యం చెల్లిస్తారు. వీరితో పాటు సెకండరీ పాఠశాలలు 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే రవాణా భత్యం విద్యార్ధుకు చెల్లించనున్నారు. ఈ మేరకు విద్యార్ధులకు దూరాన్ని బట్టి నెలకు రూ.600 చొప్పున ఏడాదికి రూ.6 వేల వరకు సర్కార్ చెల్లించనుంది. అయితే ఈ విద్యార్ధులు పాఠశాలకు వెళ్లేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వినియోగిస్తూ ఉంటేనే రవాణా భత్యం అందుతుంది. రవాణా భత్యాన్ని కూడా ప్రభుత్వం నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలోనే జమ చేయనున్నారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటాలో ప్రవేశాలకు తుది గడువు ఇదే..
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు, అన్ ఎయిడెడ్, మైనారిటీ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా కింద ప్రవేశాలకు ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, అర్హత కలిగిన విద్యార్ధులు ఆలోపు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య వర్సిటీ స్పష్టం చేసింది. కేటగిరీ-బి, కేటగిరీ-సి (ఎన్‌ఆర్‌ఐ కోటా) కింద అర్హులైన అభ్యర్థులు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ ఏడాదికి ప్రైవేటు కళాశాలల్లో ఏ కేటగిరీ కన్వీనర్ కోటా కింద అభ్యర్థులు రూ.60 వేలు, కేటగిరీ-బి కింద రూ.11.55 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఫీజు కింద చెల్లించాలని పేర్కొంది. ఇక ఎన్‌ఆర్‌ఐ విభాగంలోని సి కేటగిరీ రుసుములు బి కేటగిరీకి రెండింతలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.