Toxic: టాక్సిక్ విషయంలో రిస్కీ గేమ్ ఆడుతున్న బడా నిర్మాత

Toxic: టాక్సిక్ విషయంలో రిస్కీ గేమ్ ఆడుతున్న బడా నిర్మాత


రిలీజ్‌కు ముందే రికార్డులు కొల్లగొడుతున్నాడు రాకింగ్ స్టార్. తెలుగులో ఇండస్ట్రీలో మరే ఇతర డబ్బింగ్ సినిమాకు సాధ్యం కాని బిజినెస్ టాక్సిక్‌కు జరుగుతుంది. ఆ నెంబర్స్ వింటుంటేనే బయ్యర్లలో కంగారు మొదలైంది.. కేజియఫ్ తర్వాత.. అదే రేంజ్ మెయింటేన్ చేస్తూ టాక్సిక్ కొత్త లెక్కలకు తెర తీస్తుంది. మరి టాక్సిక్ తెలుగు బిజినెస్ ఎంత.. ఎవరు రిలీజ్ చేస్తున్నారు..? యష్.. కేజియఫ్ ముందు వరకు ఆయన కేవలం కన్నడ హీరో మాత్రమే.. కానీ ఒక్క సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు. కేజియఫ్ రెండు భాగాలు కలిపి 1500 కోట్లకు పైగానే వసూలు చేసాయి. తాజాగా టాక్సిక్‌తో మార్చి 19న రానున్నారు రాకింగ్ స్టార్. దీనిపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి.. అదే బిజినెస్‌లో కూడా కనిపిస్తుంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను దిల్ రాజు ఏకంగా 120 కోట్లకు సొంతం చేసుకున్నారు. డబ్బింగ్ సినిమాల్లో ఇది కొత్త రికార్డ్. గతంలో కేజియఫ్ 2 సినిమా 78 కోట్లకు కొన్నారు. డబ్బింగ్ సినిమాకు 120 కోట్లు అంటే చిన్న విషయం కాదు.. బ్రేక్ ఈవెన్ కోసమే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లు వసూలు చేయాలి. అంటే టాక్సిక్ మీద చాలా పెద్ద భారం ఉన్నట్లే. పైగా మార్చి 19నే ధురంధర్ 2 కూడా వస్తుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి చూడాలిక.. ఇంత భారీ లక్ష్యాన్ని ధురంధర్‌ను దాటి టాక్సిక్ చేధిస్తుందా లేదా అని..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sri Vishnu: శ్రీ విష్ణు కెరీర్‌కు విచిత్రమైన సమస్య.. ఎలా డీల్ చేస్తారో..?

Sri Vishnu: శ్రీ విష్ణు కెరీర్‌కు విచిత్రమైన సమస్య.. ఎలా డీల్ చేస్తారో..?

Spirit: ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా కండిషన్.. అదే..

Balakrishna: బాలయ్య రెడీ.. ఇక దండయాత్రే బ్యాలెన్స్

ఫిబ్రవరి 15 నుంచి బ్యాంక్‌ రూల్స్‌లో మార్పు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *