టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ-రష్మిక.. ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ క్రమంలోనే వీళ్ల పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 26వ తేదీన ఉదయ్‌పుర్‌లో పెళ్లి జరగనుందని అందులో రాసుకొచ్చారు. కాకపోతే కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరు కానున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ జరగనుంది. ఆ విషయాన్ని పెళ్లి పత్రికలో ముద్రించారు. ఈ మేరకు సినిమా సెలబ్రిటీలకు ఇదివరకే ఆహ్వానాలు అందాయి. రీసెంట్‌గా తెలంగాణ సీఎం రేవంత్‌ను కూడా విజయ్ కలిశారు. ఈ ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతోపాటే.. నెటిజన్లు అందరూ తన వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేందుకే విజయ్ తెలంగాణ సీఎంను కలిశారంటూ వార్తలు వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్ మేనేజర్ చేతివాటం
గోత్రం చూసి ఏడు తరాల సమాచారాన్ని.. చెప్పేస్తారు.. ఎక్కడంటే..
బాత్‌రోబ్‌లో కాలేజీకి.. ఐ డోంట్ కేర్ అంటూ సందేశం.. అమెరికాలో శవమైన విద్యార్థి సాకేత్
నా బిడ్డను అత్యాచారం చేసి చంపారు..సాక్ష్యాలు ఉన్నాయి
సారీ బన్నీ.. అల్లు అర్జున్ కు ఆ ఇద్దరు క్షమాపణలు