TOP 9 ET: ఆ సంతోషాన్ని, భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించలేను

TOP 9 ET: ఆ సంతోషాన్ని, భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించలేను


తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరు.. సినిమాల్లో తన తొలి అడుగును గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. పునాది రాళ్లు సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలిరోజు పిబ్రవరి పదకొండే.. అంటూ ట్వీట్ చేశారు. తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చిన వేళ… తనలో పుట్టుకొచ్చిన ఆనందాన్ని.. భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించలేనంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఆ క్షణం ఇప్పటికీ.. నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుందని.. అదో అందమైన చందమామ కథ లాంటి అనుభూతి అంటూ రాసుకొచ్చారు చిరు.అంతేకాదు ఈ సందర్భంగా.. తనకు ఆ తొలి అవకాశం ఇచ్చిన పునాది రాళ్లు.. దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతోనే… నటనలో తన ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయంటూ తన ట్వీట్‌లో కోట్ చేశారు. పునాది రాళ్లు సినిమాలోని తన ఫోటోలను కూడా షేర్ చేశారు చిరు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Andhrapradesh: 99 పైసలకే కంపెనీలకు భూములు..మండలిలో మాటల మంటలు

Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధర.. ఇవాళ తులం ఎంతంటే

భారత్-అమెరికా డీల్‌పై మాట మార్చిన వైట్‌హౌస్

మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా అమెరికా వాడుకుంది.. పాక్‌ మంత్రి అసహనం

‘రాంగ్‌సైడ్‌’ డ్రైవింగ్‌పై పోలీసుల కొరడా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *