
ప్రస్తుతం సినిమాల్లో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది గతంలో ఎన్నో కష్టాలు పడిన వారే. అవమానాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నవారే. ఈ దక్షిణాది నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. చిన్నప్పుడు చదువుకునే టప్పుడు పలు డిబేట్‌ల్లో పాల్గొన్నాడీ హీరో. తన బేస్ వాయిస్ తో అందరి మన్ననలు అందుకున్నారు. కాకపోతే రాను రాను అదే సమస్యగా మారింది. చాలా మంది తన వాయిస్ ను అవహేళన చేశారు. ‘ నీ గొంతేంటి చాలా వింతగా ఉంది’ అంటూ అవమానించారు. ఇక పెద్దయ్యాక సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కూడా తన వాయిసే తనకు అడ్డంకిగా మారింది. నటుడిగా తెరపై కనిపించాలని ఎంతోమంది దర్శకులను కలిసినప్పుడు ఎన్నో అవమానాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నాడీ ట్యాలెంటెడ్ హీరో. తన వాయిస్ కారణంగానే తాను ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. చాలా మంది తన వాయిస్ బాలేదని సినిమా అవకాశాలు కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అదే వాయిస్ తో అందరి మన్ననలు, ప్రశంసలు అందుకున్నాడు. చాలా మంది ఈ నటుడి వాయిస్ కోసమే సినిమాలకు వెళతారంటే అతి శయోక్తి కాదు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ‘నీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా’ అని ఈ హీరోపై ప్రశంసలు కురిపించాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ .. అతను మరెవరో కాదు అర్జున్ దాస్.
గతేడాది విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ నుంచి నిన్న విడుదలైన ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ వరకూ పలు సినిమాలకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇది ఆ సినిమాలకు చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా హరిహర వీరమల్లు’ ట్రైలర్‌లో అర్జున్ దాస్ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అందుకే పవన్ కూడా అర్జున్ పై ప్రశంసలు కురిపించారు.
View this post on Instagram
‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు అర్జున్ దాస్. సోలో హీరోగానూ సక్సెస్ కొట్టాడు. ఈ సినిమాల్లో అతని నటనతో పాటు వాయిస్ కూడా హైలెట్ గా నిలిచింది. ఇక పవన్ కల్యాణ్ ఓజీలో ‘అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే..’ అంటూ మెగా ఫ్యాన్స్ తో ఈలలు వేయించాడు. అన్నట్లు అర్జున్ దాస్ హీరో గానే కాకుండా విలన్ పాత్రలనూ పోషించాడు. ఈ ఏడాది విడుదలైన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో ఆయన విలన్ గానూ మెప్పించాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.