కష్టించే తత్వం, పట్టుదల, సాధించాలన్న తపన ఉంటే వయసు అనేది పెద్ద అడ్డంకి కాదని ఇప్పటికే ఎందరో నిరూపించారు. ఈ క్రమంలోనే చాలా మంది లేటు వయసులోనూ డిగ్రీలు , పీహెచ్‌డీ పట్టాల పొందుతున్నారు. క్రీడల్లో పాల్గొని పతకాలు గెలుస్తున్నారు. తమ ట్యాలెంట్ తో ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అన్న మాటను నిజం చేస్తున్నారు. అలాంటి వారిలో ఈ టాలీవుడ్ సీనియర్ నటి కూడా ఒకరు. సహాయక నటిగా సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించిన ఈ అందాల తార కొన్ని నెలల క్రితం ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు నేషనల్ లెవెల్ పోటీల్లోనూ పతకాలు సాధించి నేటి తరం అమ్మాయిలకు మార్గదర్శకంగా నిలిచారు. ఇప్పుడీ ముద్దుగుమ్మ ఖాతలో మరో బంగారు పతకం చేరింది. ఇటీవల కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 లో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించిందీ అందాల తార. దీంతో పాటు మరో రెండు విభాగాల్లోనూమెడల్స్ అందుకుంది. దీంతో ఈ నటి ఆనందానికి హద్దుల్లేవు.
50 ఏళ్ల వయసులోనూ ఈ అందాల తార చూపిస్తున్న తెగువ, డెడికేషన్ ను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ నటి ఎవరనుకుంటున్నారు? ఆమె మరెవరో కాదు ప్రగతి.
ఇవి కూడా చదవండి
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రగతి హవా కొనసాగుతోంది. ఇటీవల సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో వెండి పతకాన్ని సాధించిన ఆమె ఇప్పుడు మరోసారి మూడు మెడల్స్ సొంతం చేసుకుంది. కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో ల్డ్ మెడల్ తో పాటు మరో రెండు మెడల్స్ గెల్చుకున్నారు ప్రగతి. స్క్వేట్ 115 కిలోలు, బెంజ్ ప్రెస్ 50 కిలోలు, డెడ్ లిఫ్టు 122.5 కిలోల పోటీల్లో ఆమెకు ఈ పతకాలు వచ్చాయి. మొత్తంగా నేషనల్ ఛాంపియన్ షిప్ లో మూడు మెడల్స్ సాధించినట్లు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ప్రగతి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అందాల తారకు అభినందనలు తెలుపుతున్నారు.
పతకాలతో నటి ప్రగతి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.