Tollywood : 32 ఏళ్ల వయసులో 19 ఏళ్ల హీరోయిన్‏తో పెళ్లి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా క్రేజ్.. ఆస్తులు తెలిస్తే..

Tollywood : 32 ఏళ్ల వయసులో 19 ఏళ్ల హీరోయిన్‏తో పెళ్లి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా క్రేజ్.. ఆస్తులు తెలిస్తే..


ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. అంతేకాదు.. 32 ఏళ్ల వయసులోనే 19 ఏళ్ల హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా.. ? అతడే ఫహద్ ఫాసిల్. ఈరోజు (ఆగస్ట్ 8న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీతారలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫహద్ ప్రముఖ దర్శకుడు ఫాసిల్ కుమారుడు. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ కావడంతో చిన్నప్పుడే సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఫహద్ సహజంగానే నటుడు కావాలని కలలు కన్నాడు. ఆ కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించి గెలిచాడు. జాతీయ అవార్డు, రాష్ట్ర అవార్డు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

ఇవి కూడా చదవండి

ఫహద్ ఫాసిల్ సినిమా రంగానికి తన తండ్రి ద్వారా పరిచయం అయ్యాడు. 2002లో మొదటి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. ఆ తర్వాత 2010 లో సినిమా రంగంలోకి తిరిగి వచ్చాడు. ‘చప్పా కురిషు’ (2011) సినిమాలో తన నటనకు రాష్ట్ర అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించాడు. ఫహద్ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. 2014లో ఫహద్ ‘జోజి’, ‘ప్రేమలు’ వంటి చిత్రాలను నిర్మించి విజయం సాధించాడు.

ఇవి కూడా చదవండి :  Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?

’22 ఫిమేల్ కొట్టాయం, ‘ఆమెన్’, ‘జోజి’, ‘మాలిక్’, ‘డైమండ్ నెక్లెస్’, ‘విక్రమ్’, ‘ట్రాన్స్’ పుష్ప’ వంటి చిత్రాలలో విభిన్న రకాల పాత్రలను పోషించడం స్టార్ స్టేటస్ అందుకున్నాడు. మలయాళీ హీరోయిన్ నజ్రియా నజీమ్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి అనేక చిత్రాల్లో నటించారు. అదే సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వివాహ సమయంలో ఫహద్ వయసు 32 సంవత్సరాలు కాగా.. నజ్రియా వయసు 19 సంవత్సరాలు. ఇద్దరి మధ్య దాదాపు 13 సంవత్సరాల వ్యత్సాసం ఉంది. ఫహద్ ఫాసిల్ అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. అతనికి పోర్స్చే 911 కారెరా ఎస్, మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్, రేంజ్ రోవర్ వోగ్ ఉన్నాయి. 2019 లో, ఫహద్ కొచ్చిలో ఒక విలాసవంతమైన ఇల్లు కొన్నాడు. నివేదికల ప్రకారం అతడి ఆస్తులు రూ.45 కోట్లు కాగా.. ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్లు పారితోషికం తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..

ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *