Tollywood : 30 పర్సెంట్ అంటే కష్టం.. కార్మికుల సమ్మెపై నిర్మాత బన్నీ వాస్ రియాక్షన్..

Tollywood : 30 పర్సెంట్ అంటే కష్టం.. కార్మికుల సమ్మెపై నిర్మాత బన్నీ వాస్ రియాక్షన్..


30శాతం వేతనాలు పెంచాలని పట్టుబడుతోంది ఫెడరేషన్‌. అయితే, తెగేదాకా లాగితే ఏమవుతుందో ప్రాక్టికల్‌గా చూపిస్తామంటున్నారు ప్రొడ్యూసర్స్‌. సాఫ్ట్‌వేర్‌ శాలరీలిస్తున్నా ఈ గొంతెమ్మ కోరికలేంటంటూ.. మ్యాటర్‌ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎవరితో ఎలా పనిచేయించుకోవాలో తమకు బాగా తెలుసని చెప్పడమే కాదు చేతల్లో చూపిస్తున్నారు. తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఓ అడుగు ముందుకు వేసి అనుభవం, ప్రతిభ కలిగిన వారికి మంచి అవకాశాలు కల్పిస్తామంటూ.. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో వివాదం కాస్త ముదిరింది. తాజాగా సినీ కార్మికుల సమ్మె పై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఆయన మాట్లాడుతూ..

3 ఇయర్స్ అయింది పెంచాలి.. వాళ్లు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది.. కానీ 30 పర్సెంట్ అంటే కష్టం.. బాగా ఎక్కువ పెంచాలంటున్నారు.. అది లాజిక్‌గా లేదు.. అదే నిర్మాతలకు కాస్త కష్టంగా ఉంది అని అన్నారు వాసు. అలాగే గత కొన్నేళ్లలో 10-12 సినిమాలే ప్యాన్ ఇండియా వచ్చాయి.. ఆ సమయంలో 200-300 చిన్న సినిమాలు వచ్చాయి.. ఆ 10 సినిమాలు చూసి రెవిన్యూ పెరిగిపోయింది అంటే కష్టం. చిన్న సినిమా తీస్తున్నాను.. 12-13 కోట్లు లేకపోతే తీయలేకపోతున్నాను.. అన్నీ పెరిగిపోతున్నాయి.. ప్రొడ్యూసర్‌కు చిన్న సినిమా తీస్తున్నపుడు డబ్బులు మిగలట్లేదు.. ఏదో అద్భుతమైన బ్లాక్‌బస్టర్ అయితే తప్ప..

తెలుగు టెక్నీషియన్స్ స్కిల్ డెవలప్ చేయాలి.. ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కావాలి.. ఇప్పుడున్న వాళ్లతో ఆ క్వాలిటీ మెయింటేన్ చేయలేం.. బయటి నుంచి తీసుకురావడానికి కారణం క్వాలిటీ కోసమే.. బయటి నుంచి తెస్తే తెచ్చేసరికి మాకు డబుల్, ట్రిపుల్ ఖర్చులు అవుతున్నాయి. కానీ ఏం చేస్తాం.. క్వాలిటీ ప్రాడక్ట్ కోసం తప్పట్లేదు. ఖర్చులు పెరిగిపోయాయి. ఈ రోజు ఓ హౌజ్ లొకేషన్ కావాలంటే లక్షన్నర అడుగుతున్నారు.. రోజుకు 1-1.25 లక్షలు లేకుండా ఏం జరగదు అని బన్నీ వాసు తెలిపారు .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *