Headlines

Tollywood: 12 సినిమాలు చేస్తే అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే.. ఒక్కో సినిమాకు రూ.200 కోట్లు.. తోపు డైరెక్టర్ ఎవరంటే..

Tollywood: 12 సినిమాలు చేస్తే అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే.. ఒక్కో సినిమాకు రూ.200 కోట్లు.. తోపు డైరెక్టర్ ఎవరంటే..


సినీరంగంలో దర్శకులు అంటే హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను రూపొందిస్తుంటారు. చాలా మంది డైరెక్టర్స్ అటు హిట్లతోపాటు ఇటు ప్లాపులను సైతం ఖాతాలో వేసుకున్నారు. కానీ భారతీయ సినిమా ప్రపంచంలో ఓ డైరెక్టర్ మాత్రం ఇప్పటివరకు ఒక్క ప్లాప్ మూవీ కూడా రూపొందించలేదు. అతడి సినిమా డైరెక్షన్, మేకింగ్ అంటే జనాలకు విపరీతమైన ఆసక్తి. ఆయన సినిమాలు వస్తున్నాయంటే జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రత్యేకమైన కథ చెప్పడం, గొప్ప విజువల్స్.. ఆకర్షణీయమైన కథనాలతో కలిపి, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కృష్ణుడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఆయన మరెవరో కాదండి.. ఎస్.ఎస్. రాజమౌళి. 2001లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..

తెలుగులో సింహాద్రి, సై, ఛత్రపతి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. ఇక రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా.. యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను పౌరాణిక ఫాంటసీలో తిరిగి తీసుకువచ్చారు. మగధీర, మర్యాద రామన్న, ఈగ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కలిసి నటించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమా ఖ్యాతిని తెలియజేశాడు. బాహుబలి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాతో ప్రపంచం దృష్టి తెలుగు సినిమా వైపు మల్లింది.

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమాను ఆస్కార్ వేదిక ఎక్కించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ భారీ వసూల్లు రాబట్టింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌తో సహా అంతర్జాతీయ ప్రశంసలను అందుకుంది. గత 24 ఏళ్లలో దాదాపు 12 సినిమాలు నిర్మించగా.. ఇప్పటివరకు ఒక్క సినిమా ప్లాప్ కాలేదు. అన్ని చిత్రాలలో మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 4,200 కోట్లు దాటింది. ప్రస్తుతం మహేష్ బాబు ప్రధాన పాత్రలో SSMB29 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.200 కోట్లు తీసుకుంటున్నారట.

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *