Headlines

Tollywood: 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్.. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే.. ఈ స్టార్ ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్.. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే.. ఈ స్టార్ ఎవరో గుర్తు పట్టారా?


సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ అనే మాట ఎరుగని డైరెక్టర్ ఎవరంటే చాలా మంది దర్శక ధీరుడు రాజమౌళి పేరే చెబుతారు. ఇది నిజం కూడా. ఇప్పటివరకు రాజమౌళి 12 సినిమాలు తీస్తే అన్నీ బ్లాక్ బస్టర్లే అయ్యాయి. ఇండస్ట్రీ రికార్డులను తిరిగేశాయి. అయితే రాజమౌళితో పాటు బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అలాగే టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావి పూడి కూడా అపజయమెరుగని డైరెక్టర్లే. వీరు తీసిన సినిమాలేవీ కూడా ఫ్లాప్ అవ్వలేదు. అయితే ఇదే జాబితాలో ఒక సెన్సేషనల్ డైరెక్టర్ ఉన్నాడు. అతను ఇప్పటివరకు ఆరు సినిమాలు తీశాడు. అన్నీ కూడా సూపర్ హిట్లే. ఇందులో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఉందనుకోండి. మిగతా ఐదు సినిమాల విషయానికి వస్తే.. అన్నీ సూపర్ హిట్స్ గానే నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం మన దేశంలో ఫుల్ క్రేజ్ ఉన్న పాన్ ఇండియా డైరెక్టర్లలో ఇతను కూడా ఒకరు. అందుకే స్టార్ హీరోలందరూ ఈ డైరెక్టర్ తో సినిమాలు తీసేందుకు తహతహలాడుతున్నారు. ఎప్పుడూ మెయిన్ హీరోగా తప్పితే వేరొకరి సినిమాల్లో కనిపించని బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సైతం ఈ డైరెక్టర్ సినిమాలో ఒక క్యామియో రోల్ పోషించాడంటే అతనికెంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు కూలీ సినిమా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.

2016లో ‘అవియల్’ అనే ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా కెరీర్ ప్రారంభించాడు లోకేష్. అయితే దర్శకుడిగా అతని మొదటి చిత్రం మానగరం. 2017లో రిలీజైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక కార్తీతో కలిసి లోకేశ్ తెరకెక్కించిన ఖైదీ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. ఇందులో హీరోయిన్ ఉండదు. సాంగ్స్ కూడా ఉండవు. అయినా తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు లోకేశ్. దీని తర్వాత విజయ్ దళపతితో కలిసి మాస్టర్, లియో సినిమాలు, కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నాడు లోకేశ్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రజనీకాంత్ తో కలిసి లోకేశ్ తెరకెక్కించిన కూలీ సినిమా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రజనీకాంత్‌తో పాటు ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, రెబె మోనికా జాన్, మోనిషా ప్లెస్సీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *