Tollywood: సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టార్ హీరోలుగా సూపర్ క్రేజ్.. వీరెవరో గుర్తు పట్టారా?

Tollywood: సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టార్ హీరోలుగా సూపర్ క్రేజ్.. వీరెవరో గుర్తు పట్టారా?


పై ఫొటోలో ఉన్న అబ్బాయిలను గుర్తు పట్టారా? వీరు ఇప్పుడు పెరిగి పెద్దవారయ్యారు. స్టార్ హీరోలుగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇద్దరూ సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. ఒకరు స్టార్ నటుడి, నటి కుమారుడు అయితే.. మరొకరు స్టార్ డైరెక్టర్ కొడుకు. తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ వీరు కూడా చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.తమ క్యూట్ యాక్టింగ్ తో అదరగొట్టారు. ఆ తర్వాత హీరోలుగా నూ సక్సెస్ అయ్యారు. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మరి ఈ కుర్రాళ్లెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. వీరు మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరోలు శింబు, అరుణ్ విజయ్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన టి. రాజేందర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు శింబు. బాలనటుడిగా పలు సినిమాల్లో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక అరుణ్ మరెవరో కాదు తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించిన విజయ్ కుమార్ కుమారుడు. తమిళంలో పలు సినిమాల్లో నటించిన అతను తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు. అలాగే ప్రభాస్ నటించిన సాహోలోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు.

మణిరత్నం తెరకెక్కించిన చెక్క చివంద వానమ్‌ (తెలుగులో నవాబ్) సినిమాలో శింబు, అరుణ్ విజయ్ అన్నదమ్ములుగా నటించారు. 2018లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇటీవలే మణి రత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు శింబు. ఇందులో కమల్ హాసన్ హీరోగా నటించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం తన తర్వాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడీ స్టార్ హీరో.

ఇవి కూడా చదవండి

ఇక అరుణ్ విజయ్ విషయానికి వస్తే.. ఇటీవలే వనంగాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రియేటివ్ డైరెక్టర్ బాల తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తన్న ఇడ్లీ కడైలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *