Tollywood: సినిమాలు మానేసి కార్ రేసింగ్‏లో సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోయిన్.. సాహసాలు చూస్తే అంతే ఇక..

Tollywood: సినిమాలు మానేసి కార్ రేసింగ్‏లో సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోయిన్.. సాహసాలు చూస్తే అంతే ఇక..


సినీరంగంలో మంచి గుర్తింపు రావాలంటే అందం, టాలెంట్ తోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాల్సిందే. వరుస సినిమాల్లో నటిస్తూ విజయాలను అందుకున్నప్పటికీ సరైన బ్రేక్ రానీ తారలు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోయిన్లుగా ఎదగాల్సిన ముద్దుగుమ్మలు అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ తారగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ వయ్యారి.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ కార్ రేసింగ్ లో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం కార్ రేసింగ్ లో ఎన్నో సాహసాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ఆమె ధైర్యం, టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? తనే నివేదా పేతురాజ్. తెలుగుతోపాటు తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి, శ్రీవిష్ణు జోడిగా బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ వయ్యారి.. ఆ తర్వాత రెడ్, పాగల్, విరాట పర్వం చిత్రాల్లో కనిపించింది. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన బ్లడీ మేరీ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అయితే నివేదా నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినప్పటికీ ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న నివేద.. ఇప్పుడు కార్ రేసింగ్ లో సత్తా చాటుతుంది. నిజానికి సినిమాలతోపాటు కార్ రేసింగ్ అంటే కూడా ఈ బ్యూటీకి విపరీతమైన ఇష్టం. ఇదివరకు కార్ రేసింగ్ వీడియోస్ ఎక్కువగానే పోస్ట్ చేసింది.

మొమెంటం స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్ శిక్షకుల సమక్షంలో ఫార్ములా రేస్ శిక్షణలో మొదటి స్థాయిని పూర్తి చేసింది. తాజాగా మరోసారి కార్ రేసింగ్ స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో నివేదా స్వయంగా రేస్ కార్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. అంతేకాదు.. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇప్పటికే స్టార్ హీరో అజిత్ సైతం కార్ రేసింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో నివేదా సైతం కార్ రేసింగ్ కి ప్రయత్నిస్తుంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *