Tollywood: పాక్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో! ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ హెచ్చరిక

Tollywood: పాక్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో! ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ హెచ్చరిక


కార్తీక్ ఆర్యన్.. బాలీవుడ్‌లో చాలా పాపులర్ యువ నటుడు. స్వయృం కృషితో స్టార్ హీరోగా ఎదిగిన అతనికి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. అందులోనూ ఈ హ్యాండ్సమ్ హీరో అంటే అమ్మాయిలు పడి చస్తారు. కార్తీక్ నటించిన గత రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీలతో కలిసి ‘ఆషికి 3’ సినిమాలో నటిస్తున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి స్టార్‌గా మారిన కార్తీక్ ఆర్యన్‌ను ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ హెచ్చరించింది. ఆగస్టు 15న అమెరికాలోని హ్యూస్టన్‌లో జరగనున్న ‘ఆజాదీ ఉత్సవ్’ కార్యక్రమంలో కార్తీక్ ఆర్యన్ పాల్గొంటాడని ప్రచారం జరుగుతోంది. ‘ఆజాదీ ఉత్సవ్’ కార్యక్రమం గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. కార్తీక్ ఆర్యన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్స్ కార్తీక్ ఆర్యన్‌కు లేఖ రాసి హెచ్చరించింది.

‘ఆజాదీ ఉత్సవ్: ది ఇండియన్ ఇండిపెండెన్స్ డే’ కార్యక్రమాన్ని అగాస్ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్స్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి కార్తీక్ ఆర్యన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అగాస్ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్స్ ఒక పాకిస్తానీ వ్యక్తి యాజమాన్యంలో ఉంది. అదే రెస్టారెంట్ ‘జష్న్-ఎ-ఆజాదీ’ పేరుతో పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కూడా నిర్వహిహిస్తోంది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రముఖ పాకిస్తానీ గాయకుడు అతిఫ్ అస్లాంను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అగాస్ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్స్ యజమాని షౌకత్ మారేడియా పాకిస్తానీ మూలాలు కలిగిన వ్యక్తి అని, పాకిస్తానీలు నిర్వహించే కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు పాల్గొనడాన్ని ఫెడరేషన్ ఆఫ్ సినిమా వర్కర్స్ కాన్ఫెడరేషన్ (FWICE) వ్యతిరేకిస్తోంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా కార్తీక్ ఆర్యన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సముచితం కాదు’ అని బాలీవుడ్ ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

తాజ్ మహల్ దగ్గర హీరో కార్తీక్ ఆర్యన్..

పహల్గామ్ అటాక్ ముందుకు వరకు పాకిస్తానీ నటులు, నటీమణులు భారతీయ చిత్రాలలో నటించేవారు. గాయకులు కూడా తమ గొంతు వినిపించే వారు. అయితే పహల్గామ్ దాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత ప్రభుత్వం పాకిస్తానీ నటులపై నిషేధం విధించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *