భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాలు ఆడియన్స్‌ను మెప్పించటంలో ఫెయిల్ అవుతుంటే… ఫ్యామిలీ మూవీస్ మాత్రం నిర్మాతలకు కాసుల పంట పండిస్తున్నాయి. వెంకీ లాంటి టాప్ హీరో నటించిన సంక్రాంతికి వస్తున్నాం అయినా… అసలు పరిచయమే లేని యంగ్ స్టర్స్ చేసిన కోర్ట్ అయినా… ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఉన్న సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాయి. కథ తెలిసిందే అయినా.. ఎమోషన్స్ వర్కవుట్ అయితే రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలు కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయని నిరూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే స్టార్ హీరోల చూపు దీనిపైనే ఉందిప్పుడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి మరోసారి అదే చేస్తున్నారు. చిరుతో కుటుంబం అంతా కూర్చుని చూసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి 2026కి విడుదల కానుంది మెగా 157.
ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..
వెంకటేష్ సైతం పూర్తిగా ఫ్యామిలీ మూవీస్ పైనే ఫోకస్ చేస్తున్నారు. త్రివిక్రమ్‌తో త్వరలోనే అదిరిపోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు. దీని తర్వాత కూడా దృశ్యం 3, అనిల్ రావిపూడి మూవీస్‌ను ఫ్యామిలీ జానర్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. మరో మూడేళ్ల వరకు వెంకీ కాంపౌండ్ నుంచి ఫ్యామిలీ మూవీసే వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..
మాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రవితేజ కూడా కిషోర్ తిరుమల సినిమాతో ఫ్యామిలీ డ్రామా ట్రై చేస్తున్నారు. సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ కూడా ఫ్యామిలీ సినిమానే. మాస్ మూవీ కంటే ఫ్యామిలీ డ్రామాలే సేఫ్ అని ఫీల్ అవుతున్న మన హీరోలు, కుటుంబం అంతా కూర్చుని చూసే సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..