Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్.. వేతనాలు 30 శాతం పెంచితేనే..

Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్.. వేతనాలు 30 శాతం పెంచితేనే..


టాలీవుడ్‌లో సమ్మె సైరన్‌ మోగింది. వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో సమ్మెకు పిలుపునిచ్చారు సినీ కార్మికులు. ఈరోజు నుంచి సినిమా షూటింగ్స్‌ నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ షూటింగ్స్‌కి రాబోమని తేల్చిచెప్పేసింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌. అయితే దీనిపై తాజాగా తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక ప్రకటన విడుదల చేసింది.

ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ పక్షపాతంగా 30 శాతం వేతనాలు పెంపునకు డిమాండ్ చేస్తోందని.. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి, లేని వర్కర్లకు మనం ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నామన్నారు. ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సమ్మె కారణంగా నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టం కలుగుతుందన్నారు. చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పని చేస్తున్న తాము.. వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధించేందుకు చాంబర్ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతోంది. నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు లేక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా చాంబర్ జారీ చేసే మార్గనిర్దేశాలను కచ్చితంగా అనుసరించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మూడేళ్లకోసారి 30 శాతం వేతనం పెంచాలన్నది టాలీవుడ్‌లో పెట్టుకున్న రూల్‌. ఈ నిబంధన ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తోంది తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌. అంతేకాదు, పెంచిన వేతనాలను ఏ రోజుకారోజు చెల్లించాలని మరో షరతు విధించారు. ఈ రెండు ప్రధాన డిమాండ్లను ఒప్పుకుంటేనే షూటింగ్స్‌ చేస్తామంటున్నారు సినీ కార్మికులు. ఈ షరతులకు అంగీకరించిన నిర్మాతల సినిమాలకు మాత్రమే పనిచేస్తామని చెబుతున్నారు.

వేతనాల పెంపు డిమాండ్‌పై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా ఫిల్మ్‌ ఛాంబర్‌ – తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ మధ్య చర్చలు విఫలమయ్యాయి. రూల్స్‌ ప్రకారం 30 శాతం వేతనాలు పెంచాలని ఫెడరేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేస్తుంటే.. కేవలం 5 శాతం మాత్రమే పెంచుతామంటున్నారు నిర్మాతలు. మూడేళ్లకోసారి వేతనాలు పెంచాల్సిన గడువు జూన్‌ 30తోనే ముగిసిందని.. అయినా ఇప్పటివరకూ ఆగామని, ఇక ఇప్పుడు పెంచాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. సమస్య పరిష్కారానికి నిర్మాతల మండలి – ఫెడరేషన్‌ మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

ఇది చదవండి: ఒకప్పుడు ఈ హీరోయిన్‌ను కుక్కతో రీప్లేస్ చేశారు.. ఇప్పుడు రూ. 163 కోట్లతో పాన్ ఇండియా ఫేమస్.. ఎవరంటే.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *