Tollywood: చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు.. తను ఏం చెప్పాడంటే.!

Tollywood: చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు.. తను ఏం చెప్పాడంటే.!


దర్శకుడు వి.ఎన్.ఆదిత్య గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్‌తో తనకున్న రిలేషన్‌ను, అతడితో మాట్లాడిన చివరి మాటలు, శ్రీరామ్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శ్రీరామ్ చిత్రం విషయంలో రావాల్సినంత విజయం దక్కలేదని ఆదిత్య అభిప్రాయపడ్డారు. మనసంతా నువ్వే సినిమా విజయం తర్వాత ఉదయ్ కిరణ్‌కు వచ్చిన క్రేజ్ కారణంగా శ్రీరామ్ వంటి యాక్షన్ చిత్రానికి అంచనాలు వేరేలా ఉంటాయని ముందుగానే పోస్టర్ల విషయంలో తాను సూచించానని తెలిపారు. అయితే, మొహబ్బతే తరహా పోస్టర్లను విడుదల చేయడం, సినిమా యాక్షన్ జానర్‌కు విరుద్ధంగా ఉండటం తనను నిరాశపరిచిందని చెప్పారు.

శ్రీరామ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ పొందడం వల్ల సినిమా పబ్లిసిటీపై ఆసక్తి చూపించలేదని ఆదిత్య వివరించారు. అటు మనసంతా నువ్వే నిర్మాత ఎం.ఎస్.రాజు సినిమా విజయం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రమోషన్ల కోసం ఖర్చు చేస్తే లాభాలు తగ్గుతాయని నిర్మాత అనడంతో, తాను, ఉదయ్ కిరణ్ కలిసి ప్రచారం చేద్దామన్నా కూడా ఫలితం లేకపోయిందని ఆదిత్య పేర్కొన్నారు. ఇది సినిమా విజయానికి అడ్డంకిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై తనకు బాధ కంటే కోపమే ఎక్కువని ఆయన స్పష్టం చేశారు. ఆత్మహత్య అనేది బలహీనమైన చర్య అని, ఎంత దీనమైన స్థితిలో ఉన్నా జీవితం కంటే ఏదీ గొప్పది కాదని ఆయన చెప్పారు. ఉదయ్ కిరణ్ లాంటి స్టార్, ప్రేక్షకుల గుండెల్లో ఉన్న వ్యక్తి, తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి, చివరికి అలాంటి నిర్ణయం తీసుకోవడం తనకు అస్సలు నచ్చలేదని ఆదిత్య తెలిపారు. అతడితో చివరి ఫోన్ కాల్ చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా సాగిందని ఆదిత్య గుర్తుచేసుకున్నారు. అత్తారింటికి దారేది సినిమా విజయం తమ జానర్‌కు మళ్లీ మార్కెట్ తెచ్చిందని, కొత్త కథలతో పెద్ద విజయాలు సాధిద్దామని ఉదయ్ కిరణ్ తనతో చెప్పాడని వివరించారు. పాజిటివ్‌గా, ఎప్పుడూ ప్రణాళికలతో ఉండేవాడని, చివరికి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి ఆరు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని వార్త వినడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *