పై ఫొటోలో నెత్తి మీద కోతిని కూర్చొపెట్టుకుని సరదాగా ఆడుకుంటోన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. బోల్డ్ అండ్ రొమాంటిక్ హీరోయిన్ గా జెట్ స్పీడ్ లో దూసుకెళ్లుతోంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా పాత్ర నచ్చితే చాలు సపోర్టింగ్ రోల్స్ లోనూ నటిస్తుందీ అందాల తార. అందుకే ఈ ముద్దుగుమ్మ కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ బ్యూటీ స్పెషాలిటీ ఏంటంటే పాత్రకు తగ్గట్టుగా మారిపోవడం.. కొన్ని సినిమాల్లో చీర కట్టుకుని చాలా ట్రెడిషినల్ గా కనిపించిన ఈ హీరోయిన మరి కొన్నిమూవీస్ లో బోల్డ్ అండ్ రొమాంటిక్ రోల్స్ లోనూ నటించి మెప్పించింది. ఒక సినిమాలో అయితే ఏకంగా వేశ్య పాత్రలో నటించి డేరింగ్ బ్యూటీ గా ప్రశంసలు కూడా అందుకుంది. రవితేజ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీకి నెట్టింట కూడా మస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ఫొటోలకు నెటిజన్ల నుంచి లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం కూడా మేమే చెబుదాం లెండి. తను మరెవరో కాదు కేరాఫ్ కంచరపాలెం హీరోయిన్ ప్రణీత పట్నాయక్.
2018లో రిలీజై సంచలన విజయం సాధించిన కేరాఫ్ కంచర పాలెం సినిమాలో భార్గవి పాత్రలో అద్భుతంగా నటించింది ప్రణీత. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. దీని తర్వాత పలు సినిమాల్లో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించిందీ అందాల తార. దుల్కర్ సల్మాన్- మృణాళ్ ఠాకూర్ ల ప్రేమ కావ్యం సీతారామం సినిమాలో వేశ్య పాత్రను అద్భుతంగా పోషించి బోల్డ్ అండ్ డేరింగ్ బ్యూటీ అనిపించుకుంది. అలాగే ‘నెట్’ సినిమాలో రాహుల్ రామకృష్ణ భార్యగా కొన్ని రొమాంటిక్ సీన్లలోనూ నటించింది.
ఇవి కూడా చదవండి
ప్రణీత పట్నాయక్ లేటెస్ట్ ఫొటోస్..
సినిమాలతో పాటు పరువు అనే తెలుగు వెబ్ సిరీస్ లోనూ ఓ ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా గత ఏడాది బాలీవుడ్ లో విడుదలైన సన్నీ డియోల్ సినిమా జాట్ లోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది ప్రణీత పట్నాయక్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.