Tollywood: ఒరిజినల్ పాములతో ఆ సినిమా షూట్ చేశాం.. పాము కాటేసి ఒక వ్యక్తి చనిపోయాడు.. డైరెక్టర్ కామెంట్స్..

Tollywood: ఒరిజినల్ పాములతో ఆ సినిమా షూట్ చేశాం.. పాము కాటేసి ఒక వ్యక్తి చనిపోయాడు.. డైరెక్టర్ కామెంట్స్..


దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటుడిగా కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దేవి సినిమా నిర్మాణ సమయంలో జరిగిన సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. కోడి రామకృష్ణ గ్రాఫిక్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ట్రెండ్‌సెట్టర్‌ అని, అమ్మోరు వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన పనితీరును ప్రశంసించారు. దేవి ప్రసాద్ దేవి సినిమాకు కో-డైరెక్టర్‌గా పనిచేశానని, ఈ చిత్రం గ్రాఫిక్స్‌తో పాటు నిజమైన పాములను కూడా ఉపయోగించామని స్పష్టం చేశారు. దేవి సినిమా అమ్మోరు కంటే పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

దేవి సినిమా చిత్రీకరణ సమయంలో అసలు పాములను ఉపయోగించిన సందర్భంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. గ్రాఫిక్స్ పనులు చివరి దశలో ఉన్నప్పటికీ, ప్రారంభ సన్నివేశాలలో నిజమైన పాములను వాడారు. ఒక పాముల బృందంతో కొత్తగా చేరిన, సుమారు 19-20 ఏళ్ల యువకుడిని వైజాగ్ షూటింగ్‌కు పంపించారు. తాను చాలా అనుభవం ఉన్నవాడినని, అన్ని తెలుసని అతను చెప్పాడు. ఒక షాట్‌లో పాము లైట్ల వల్ల కదలకుండా ఉండటంతో, అతను సంచిలో నుంచి ఒక పామును బయటికి తీశాడు. ఆ పాము కోరలు పీకేసినప్పటికీ, అది తనపై కొట్టినప్పుడు రక్తం వచ్చిందని, అయితే అది మామూలే అని ఆ యువకుడు చెప్పాడని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

అంతేకాకుండా, నటి వనిత ఒక పాటలో పాముతో బొట్టు పెట్టించుకునే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు, వనిత పాము విషరహితమని భావించి, దానిని కొట్టవద్దని చెప్పింది. పాము ఆమె వేలిని పట్టుకుని వదలకపోవడంతో రక్తం వచ్చింది. యూనిట్ సభ్యులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాముల యువకుడు అది విషరహితమని, కోరలు తీసేశారని చెప్పడంతో ప్రమాదం తప్పింది. అదే రోజు రాత్రి ఆ యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. తొలుత పాన్ పరాగ్ ప్రభావమని భావించినప్పటికీ, తర్వాత వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి 12 గంటలకు ఆ యువకుడు మరణించినట్లు మేనేజర్ యూనిట్‌కు తెలియజేశాడు. మరుసటి రోజు విజయదశమి కావడంతో ఈ ఘటన చిత్ర బృందానికి పెద్ద షాక్‌ను ఇచ్చింది. సినిమాల్లో నటించాలని ఇంట్లోంచి పారిపోయి వచ్చాడని, అతని స్వస్థలం కూడా తెలియదని దేవి ప్రసాద్ గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *