పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ పాల్గొంది. ఫేమస్ టీవీ షోలకు హోస్ట్ గానూ వ్యవహరిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తరచూ తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన ఈ అందాల తార కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేసింది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ వంటి టైటిల్స్ ను కూడా గెల్చుకుంది. కొన్నేళ్ల పాటు న్యూస్ యాంకర్ గా కూడా పని చేసింది. అదే సమయంలో యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో సీరియల్స్ లో ఈ బ్యూటీకి మంచి అవకాశాలు వచ్చాయి. అయితే ఈ ముద్దుగుమ్మ కెరీర్ కు బిగ్ బాస్ బిగ్ బూస్టప్ ఇచ్చింది. హౌస్ లో తన ప్రవర్తన ఎలాగున్నా బయటకు వచ్చాక సినిమా అవకాశాలు పెరిగాయి. అలా ఒకటి, రెండు సినిమాల్లో హీరోయిన్ గా, మరికొన్ని చిత్రాల్లో సహాయక నటిగా మెప్పించింది. మరి ఇంతకీ ఆమె ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే ఆన్సర్ కూడా మేమే చెబుతాం లెండి. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ ఫేమ్, కొన్ని రోజుల పాటు జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరించిన సిరి హన్మంతు.
విశాఖపట్నంలో పుట్టి పెరిగిన సిరి పలు అందాల పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత న్యూస్ యాంకర్ గా, ఆపై నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎవరే నువ్వు మోహిని, సావిత్రమ్మగారి అబ్బాయి, అగ్నిసాక్షి తదితర సీరియల్స్‌లో నటించి మెప్పించిన సిరి ఇద్దరి లోకం ఒకటే, నరసింహపురం, ఓరేయ్ బుజ్జిగా, బూట్ కట్ బాలరాజు తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలోనూ ఓ క్యామియో రోల్ లో కనిపించింది. వీటితో పాటు పులి మేక వంటి వెబ్ సిరీస్‌లతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇవి కూడా చదవండి
వరలక్ష్మీ వ్రతం పూజల్లో సిరి, శ్రీహాన్..
సినిమాలు, టీవీ షోలు వెబ్ సిరీస్ లతో పాటు తన రిలేషన్ షిప్ విషయంతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది సిరి. ప్రముఖ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ తో ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉందీ అందాల తార. వీరిద్దరూ కలిసి ఓ బాబును దత్తత కూడా తీసుకుని పెంచుకుంటున్నారు. శ్రీహాన్ తో తన రిలేషన్ షిప్ గురించి ఎన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినా సిరి మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. తమకు నచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తోంది.
కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవితో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి