Tollywood: ఎన్టీఆర్‏తో బ్లాక్ బస్టర్.. రామ్ చరణ్‏తో డిజాస్టర్.. 38 ఏళ్ల క్రేజీ హీరోయిన్..

Tollywood: ఎన్టీఆర్‏తో బ్లాక్ బస్టర్.. రామ్ చరణ్‏తో డిజాస్టర్.. 38 ఏళ్ల క్రేజీ హీరోయిన్..


దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్ ఆమె. అందం, అభినయంతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్. ఒకప్పుడు అబ్బాయిల డ్రీమ్ గర్ల్. తక్కువ సమయంలోనే అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం తగ్గలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే హిందీలో వరుసగా రెండు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగులోకి అడుగుపెట్టింది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ జెనీలియా.

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..

జెనీలియా.. తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. ఇప్పటికీ హాసిని అంటూ ముద్దుగా పిలిచుకుంటారు. 2003లో వచ్చిన తుజే మేరి కసమ్ సినిమాతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇందులో హరిణీ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో జెనీలియా పేరు మారుమోగింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. సత్యం, సై, నా అల్లుడు, సాంబ, హ్యాపీ, సుభాష్ చంద్రబోస్ వంటి చిత్రాల్లో నటించింది. ఎన్టీఆర్ సరసన సాంబ, నా అల్లుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇక సిద్ధార్థ్ జోడిగా బొమ్మరిల్లు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో హాసిని పాత్రకు ప్రాణం పోసింది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన ఆరెంజ్ చిత్రంలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ జోడిగా నటించింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. చాలా కాలం తర్వాత హిందీలో వేద్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. ఇటీవలే అమీర్ ఖాన్ జోడిగా సితారే జమీన్ పర్ చిత్రంలో నటించింది. అలాగే ఇటీవలే జూనియర్ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *