సాధారణంగా స్టార్ హీరోయిన్స్ ఫిట్నెస్, లుక్స్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. మంచి డైట్, వర్కవుట్స్, యోగాతో నిత్యం తమ బాడీని యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటారు. అలాగే కఠినమైన వ్యాయమాలు చేస్తూ వయసు పెరిగినా ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంటారు. అయితే హీరోయిన్స్ బ్యూటీ సీక్రెట్స్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తారల అందానికి రహస్యం ఏంటీ అని సెర్చ్ చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్ గురించి విని నెటిజన్స్ షాకవుతున్నారు. రోజూ ఉదయం లేవగానే ఆ స్టార్ హీరోయిన్ చేసే పని తెలిసి అంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ? ఏంటా బ్యూటీ సీక్రెట్ అని తెలుసుకుందామా.
ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..
ఇవి కూడా చదవండి
ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. ? తనే టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా. ఇటీవల ఓ వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్.. మొటిమలు తగ్గించుకోవడానికి మీరేం చేస్తారు.. ? అని అడగ్గా.. తమన్నా మాట్లాడుతూ.. ఉదయం లేవగానే బ్రష్ చేయకముందే నోటిలో ఉండే లాలాజలం (ఉమ్మి).. మొటిమలపై రాసుకుంటాను. అవి తగ్గిపోతాయి. ఇది నాకు వ్యక్తిగతంగా బాగానే వర్కౌట్ అయ్యింది. దీని వెనక సైన్స్ ఉందని నమ్ముతున్నాను. ఎందుకంటే ఉదయం నిద్రలేవగానే వచ్చే సలైవాలో యాంటీ బాక్టీరియా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో తమన్నా చెప్పిన కామెంట్స్ విని నెటిజన్స్ షాకవుతున్నారు.
ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..
మొటిమలు తగ్గించుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాల క్రీములు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇలా ఉదయాన్నే సలైవా రాసుకోడం ఎంట్రా బాబు అంటూ తలపట్టుకుంటున్నారు. గతంలోనూ ముఖానికి సలైవా రాసుకుంటానని తమన్నా వెల్లడించింది. ఇన్నాళ్లు తెలుగులో వరుస సినిమాల్లో నటించిన తమన్నా.. ఇప్పుడు హిందీలో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. 5 నిమిషాల పాట కోసం కోట్లలో పారితోషికం వసూలు చేస్తుంది. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా.. ఇటీవల విడిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..