ఒక సాంగ్ లో ప్రధానంగా లిరిక్స్, మ్యూజిక్స్ ఉంటాయి. కొందరు ఎక్కువగా మ్యూజిక్ నే వింటుంటారు. మరికొందరు మాత్రం ఎంతో ఆసక్తిగా లిరిక్స్ ను గమనిస్తూ సాంగ్ ను ఆస్వాదిస్తుంటారు. అలా తెలుగులో వచ్చిన కొన్ని పాటల్లోని లిరిక్స్ ను వింటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. ఒక రకమైన పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సాంగ్ కు కూడా చాలా మ్యాజిక్ ఉంది. ఎప్పుడైనా జీవితంపై విరక్తి కలిగినా, అరే.. లైఫ్ అంటే ఇంతేనా? అన్ని కోల్పోయాం అని లోగా అనిపించినా ఒక్కసారి ఈ సాంగ్ వినండి.. కచ్చితంగా మన మూడ్ మారిపోతుంది. మనసు తేలికైపోతుంది. ఇంతకీ ఆ పాట ఏదనుకుంటున్నారా? సాధారణంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కలానికి పదునెక్కువ. ఆయన రాసిన పాటలు శ్రద్ధగా వింటే మన జీవితంలో చాలా సానుకూల దృక్పథాన్ని నింపుతాయి. అలాంటి పాటే చిరునువ్వుతో మూవీలో ఉంది. 2000లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో వేణు తొట్టెంపూడి హీరోగా నటించాడు. అలాగే షహీన్ కాన్ హీరోయిన్ గా నటించింది. ఇక వేణు మరదలి పాత్రలో ప్రేమ నటించింది.
చిరునవ్వుతో సినిమాలోని సాంగ్స్ అన్నీ బాగుంటాయి. యూట్యూబ్ లో కూడా లక్షల కొద్దీ వ్యూస్ ఉన్నాయి. అయితే ఒక సాంగ్ కు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అదే సిరివెన్నల సీతారామశాస్త్రి రాసిన సంతోషం సగం బలం సాంగ్. ఇందులోని మ్యూజిక్, లిరిక్స్ ఎంతో వినసొంపుగా ఉంటాయి. ముఖ్యంగా లిరిక్స్ బాగా హైలెట్ అయ్యాయి. ఎప్పుడైనా మనసు భారంగా అనిపించినప్పుడు ఈ సాంగ్ ఒక్కసారి వింటే చాలు మైండ్ చాలా రిలాక్స్ డ్ గా అనిపిస్తుంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతు ఈ సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ కాగా ఎప్పటిలాగే మణిశర్మ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు.
చిరునవ్వుతో సినిమాలోని సంతోషం సగం బలం వీడియో సాంగ్..
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.