Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్‌.. ఎవరో గుర్తుపట్టారా?


పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్. ప్రజెంట్ ఈ బ్యూటీ పేరు తెగ వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె మెయిన్ లీడ్ చేసిన ఒక సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా యావరేజ్‌ గా నిలిచినా ఈ ముద్దుగుమ్మ అభినయంపై మాత్రం తెగ ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమాలో హీరో కన్నా ఈమెనే హైలెట్ గా నిలిచిందని రివ్యూలు, సినిమా విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు. ఈ ముద్దుగుమ్మ చదువుకునే వయసులోనే మోడలింగ్ స్టార్ట్ చేసింది. ఎంబీఏ మధ్యలోనే వదిలిపెట్టి మోడల్ గా అదృష్టం పరీక్షించుకుంది. అలా ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ బ్యూటీని చూసి తన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో ఒక చిన్న రోల్ ఇచ్చారు. దీని తర్వాత ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందీ అందాల తార. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లోనూ కథానాయికగా చేసింది. ఈ హీరోయిన్ కు అందం, అభినయం రెండూ ఉన్నాయి. కానీ ఎందుకోగానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోలేకపోయింది. అందుకే కొన్ని సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ రోల్స్ కూడా చేసింది. అయితే చాలా గ్యాప్ తర్వాత ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ అందాల తార. దీంతో ఇప్పుడు మరోసారి ఈ హీరోయిన్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. మరి ఇంతకీ ఈ క్యూటీని గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ హీరోయిన్ ఈషా రెబ్బా

ఇవి కూడా చదవండి

తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏ ఆర్ సజీవ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించింది. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ జయ జయ జయ జయహే కు ఇది రీమేక్. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈషా నటన పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా ఈ సినిమా కంటే ముందు ఆమె 2023లో మామా మశ్చీంద్ర అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. అలాగే కొన్ని తమిళ, మలయాళ సినిమాల్లోనూ చేసింది.

ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్..

‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా షూటింగ్ లో ఈషా రెబ్బా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *