Headlines

Tollywood: ఇదెలా మిస్సయిందబ్బా.! మహేష్ బాబును రెండుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే.?

Tollywood: ఇదెలా మిస్సయిందబ్బా.! మహేష్ బాబును రెండుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే.?


Tollywood: ఇదెలా మిస్సయిందబ్బా.! మహేష్ బాబును రెండుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే.?

సూపర్ స్టార్ మహేష్ బాబు అనేక మంది స్టార్ హీరోయిన్లతో కలిసి నటించినప్పటికీ, ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఆయనతో నటించేందుకు నో చెప్పేసింది. దీంతో సిల్వర్ స్క్రీన్‌పై ఒక అరుదైన జోడి మిస్ అయ్యింది. మహేష్ బాబుకు రెండు సార్లు నో చెప్పిన ఆ నటి ఎవరో కాదు, దివంగత నటి సౌందర్య. మహానటి సావిత్రి లాంటి నటనతో ఒకప్పుడు ఫ్యాన్స్‌ను అలరించింది సౌందర్య. గ్లామర్ అంటే ఎక్స్‌పోజింగ్ కాదని.. అందంగా ఉంటే సరిపోతుందని చెప్పి.. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ పెంచుకుంది ఈమె.

మహేష్ బాబు హీరోగా రూపొందిన యువరాజ్ సినిమా కోసం మొదట సౌందర్యను హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ఆ సమయంలో నిర్వహించిన ఫోటో షూట్‌లో, మహేష్ బాబు సౌందర్య పక్కన చిన్నగా, తమ్ముడిలా కనిపించాడట. ఈ కారణంతో సౌందర్య ఆ సినిమాలో నటించడానికి నిరాకరించింది. ఆ తర్వాత సిమ్రాన్ ఆ పాత్రలో నటించింది. ఇలాంటి అనుభవమే మరోసారి ఎదురైంది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ సినిమాకు కూడా ఇదే జరిగింది. ఈ చిత్రంలో మహేష్ బాబు జోడిగా శ్రియ నటించగా, ఆయనకు అక్క పాత్రలో కీర్తి రెడ్డి కనిపించారు. అయితే, ఈ అక్క పాత్ర కోసం ముందుగా సౌందర్యను సంప్రదించారట. మహేష్ బాబుకు అక్కగా చేయనని సౌందర్య ఆ పాత్రకు కూడా నో చెప్పినట్టు టాక్. ఈ విధంగా సౌందర్య రెండు సార్లు మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశాలకు నో చెప్పేశారు. మొత్తంగా, ఈ అరుదైన కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై సెట్ కాకుండానే పోయింది. ఇక అర్జున్ సినిమా విడుదలైన ఏడాదిలోనే సౌందర్య ఒక ప్రమాదంలో కన్నుమూశారు. ఇది మహేష్ బాబు అభిమానులకు ఒక తీరని కోరికగానే మిగిలిపోయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *