Tollywood: ఆ హ్యాబిట్ సిల్క్ స్మితకు ఉంది.. సెట్‌లోకి రాగానే.! అసలు నిజాన్ని చెప్పిన డైరెక్టర్

Tollywood: ఆ హ్యాబిట్ సిల్క్ స్మితకు ఉంది.. సెట్‌లోకి రాగానే.! అసలు నిజాన్ని చెప్పిన డైరెక్టర్


Tollywood: ఆ హ్యాబిట్ సిల్క్ స్మితకు ఉంది.. సెట్‌లోకి రాగానే.! అసలు నిజాన్ని చెప్పిన డైరెక్టర్

ప్రముఖ దర్శకుడు రాజా వన్నెం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినీ నటి సిల్క్ స్మితతో తన అనుభవాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. బావ బావమరిది చిత్రంలోని సిల్క్ స్మిత పాట ఒక్కటి సౌత్ ఇండస్ట్రీనే కదిలించింది. ఈ పాట పుట్టుక తూర్పు గోదావరిలోని భోగం మేళాల నుంచి వచ్చిందని, దాని అసలు రూపం పచ్చి బూతుతో కూడుకున్నదని ఆయన తెలిపారు. ఈ పాటను మోహన్, సీఎం కృష్ణ ఎంతగానో ఇష్టపడి చేయించాలని నిర్ణయించుకున్నారని, మొదట్లో సంగీత దర్శకుడు కోటి అంత ఆసక్తి చూపకపోయినా, మోహన్ పట్టుదల వల్లే అది సాధ్యమైందని వివరించారు.

సిల్క్ స్మిత సెట్‌లో వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ఆమె తనను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారని, తనను లెనిన్ అని పిలిచేవారని రాజా వన్నెం వెల్లడించారు. సెట్‌లోకి రాగానే “రాజా ఎక్కడ?” అని అడిగి, తనతో భుజంపై చేయి వేసి మాట్లాడేవారని తెలిపారు. ఆమె డబ్బింగ్ చెప్పే సమయంలోనూ, రాజా వన్నెంను పక్కన కూర్చోబెట్టుకుని, సంభాషణలు చెప్పాల్సిన సమయంలో సైగ చేయమని కోరిందని, కేవలం మూడు రోజుల్లో రెండు, మూడు గంటలు మాత్రమే వచ్చి డబ్బింగ్ పూర్తి చేసిందని చెప్పారు. సిల్క్ స్మిత సహజంగానే మాడ్యులేషన్ కలిగి ఉందని, ఆమె మాటలే ఆమె వాయిస్ అని ఆయన అన్నారు. సెట్‌లో సిల్క్ స్మిత ఎవరినీ పలకరించేది కాదని, తన డైలాగ్ పూర్తి చేసుకున్న తర్వాత దూరంగా కుర్చీలో కూర్చుని పుస్తకాలు చదువుకునేదని లేదా అసిస్టెంట్‌తో మాట్లాడేదని తెలిపారు. బావ బావమరిది చిత్రం సమయంలో తనతోనే ఎక్కువగా మాట్లాడేదని చెప్పారు. ఆమె ఈ స్వభావాన్ని కొంతమంది అహంకారంగా భావించినప్పటికీ, అది ఆమెకు మైనస్ కాదని, కేవలం తన పని తాను చేసుకునే వ్యక్తిత్వం అని రాజా వన్నెం వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *