కపుల్ ఫ్రెండ్లీ హీరోయిన్ మానస వారణాసి తన కెరీర్, తాజా చిత్రం కపుల్ ఫ్రెండ్లీ గురించి వివరించింది. ఈ సినిమాలో సంతోష్ శోభన్‌తో కలిసి నటించడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని ఆమె తెలిపింది. సంతోష్ శోభన్ అద్భుతమైన నటుడని, ఆయన ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దే తీరును చూసి తాను ఎన్నో నేర్చుకున్నానని అన్నారు. అటు చిన్నతనం నుంచి మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాలు చూస్తూ పెరిగానని, వారితో పనిచేయడం గొప్ప గౌరవమని చెప్పారు.
అయితే గత రెండు సంవత్సరాలలో తాను కొత్త దర్శకులు, కొత్త కథలతో కూడిన సినిమాలను చూశానని, కొత్త తారలు, దర్శకులతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్‌ను ప్రభాస్ స్వయంగా పోస్ట్ చేయడం తనను ఎంతో ఆశ్చర్యపరిచిందని, ఆయన గొప్ప మనసుతో తమ సినిమాకు మద్దతు ఇచ్చారని తెలిసి ఎంతో సంతోషం కలిగిందని మానస అన్నారు. సీనియర్ నటులు రాజీవ్ కనకాల, యోగి బాబులతో పనిచేయడంపై తన అనుభవాలను పంచుకున్నారు. రాజీవ్ కనకాల చాలా సరదా వ్యక్తి అని, సెట్స్‌లో ఫుడ్ గురించి మాట్లాడుకునేవారమని చెప్పారు. ఒక భయంకరమైన సన్నివేశంలో రాజీవ్ కనకాల అరిచిన తీరు తనలో సహజమైన భయాన్ని కలిగించిందని వివరించారు. మహేష్ బాబు తనకు ఇష్టమైన నటుడని.. ఆయనతో కలిసి పని చేయాలని చెప్పింది.