Headlines

Tollywood: ఆ స్టార్ నటుడికి కూతురుగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. అతడెవరో తెలుసా.?

Tollywood: ఆ స్టార్ నటుడికి కూతురుగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. అతడెవరో తెలుసా.?


టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు సీనియర్ హీరోయిన్‌గా పలు కీలక రోల్స్‌లో నటించిన రమ్యకృష్ణ అభిమానుల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించిన రమ్యకృష్ణ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించి మెప్పించారు. బాహుబలి చిత్రంతో ఆమె తన రెండో ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రమ్యకృష్ణ మొదటి తెలుగు చిత్రం 1985లో విడుదలైన ఇద్దరు మిత్రులు. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కెరీర్ ప్రారంభ దశలో ఆమె కొన్ని పరాజయాలను చవిచూశారు. అయితే, దర్శకుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లుడుగారు చిత్రం ఆమె కెరీర్‌కు ఒక మలుపునిచ్చింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో, ఆమె తిరిగి వెనుతిరిగి చూడలేదు.

పౌరాణిక చిత్రాలలో దేవత పాత్రలను, అలాగే విలన్ పాత్రలను కూడా పోషించి రమ్యకృష్ణ తన నటనలోని వైవిధ్యాన్ని నిరూపించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆమె ఓ సీనియర్ నటుడికి భార్యగా, చెల్లిగా, కూతురుగా నటించారు. ఆ నటుడు మరెవరో కాదు నాజర్. మొదటగా, బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాలో నాజర్ బిజ్జలదేవుడి పాత్రను పోషించారు. రమ్యకృష్ణకు భర్తగా నటించారు. రెండోది.. రజనీకాంత్ నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ నాజర్‌కి చెల్లెలుగా నటించి మెప్పించారు. చివరగా, పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా తమిళ రీమేక్ అవంతా రాజావతాన్ వరువేన్ చిత్రంలో రమ్యకృష్ణ నాజర్ కూతురుగా నటించారు. తెలుగులో నదియా పోషించిన పాత్రను తమిళంలో రమ్యకృష్ణ చేశారు.

Ramya Krishna 1

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *