Tirupati Laddu: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక క్యాష్‌ లేకున్నా నో టెన్షన్.. ఈజీగా లడ్డూ పొందొచ్చు!

Tirupati Laddu: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక క్యాష్‌ లేకున్నా నో టెన్షన్.. ఈజీగా లడ్డూ పొందొచ్చు!


శ్రీవారి భక్తులు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు శ్రీవారి పవిత్ర ప్రసాదమైన లడ్డూను పొందేందుకు కౌంటర్ వద్ద ఇకపై గంటల తరబడి నిలబడే అవసరం లేకుండా టీటీడీ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇక తిరుమలలోని ప్రతి లడ్డూ విక్రయ కేంద్రం వద్ద యూపీఐ పేమెంట్‌కు సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ, లడ్డూ విక్రయాల నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే భక్తుల రద్దీ పెరగడంతో గతేడాది కియోస్క్‌ యంత్రాలను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ఈ కియోస్క్ యంత్రాల ద్వారా కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసి యూపీఐ ద్వారా పేమెంట్‌ చేస్తే మీకు ఓ రశీదు వస్తుంది. దాన్ని తీసుకెళ్లి కౌంటర్‌లో ఇచ్చి లడ్డూలు పొందేవారు. అయితే గతకొన్ని రోజులుగా ఈ కియోస్క్ ఈ యంత్రాల్లో సాంకేతిక సమస్యల కారణంగా భక్తుల రద్దీ పెరగడంతో నేరుగా లడ్డూ కౌంటర్ల వద్దనే యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం ద్వారా కియోస్క్ యాంత్రాల వద్ద భక్తులు నిల్చునే అవసరం లేకుండా నేరుగా కౌంటర్ వద్దే యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి నేరుగా లడ్డూలు పొందేలా సేవలను అందించనుంది. అయితే తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని కౌంటర్లలో ఈ సేవలను టీటీడీ అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. వాటికి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి మిగతా లడ్డూ కౌంటర్లకు వద్ద కూడా దీన్ని అమలు చేయనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *